Election Commission: గాడితప్పుతున్న ప్రసంగాలపై ఈసీ ఆగ్రహం.. బీజేపీ, కాంగ్రెస్ అధ్యక్షులకు నోటీసులు
ABN , Publish Date - May 22 , 2024 | 05:09 PM
లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ప్రధాన పార్టీల స్టార్ క్యాంపెయినర్లు చేస్తున్న ప్రసంగాలు గాడి తప్పుతున్నాయంటూ ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి తూ.చ. తప్పకుండా పాటించేలా స్టార్ క్యాంపెయినర్లకు సూచించుకోవాలని బీజేపీ, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులకు వేర్వేరు నోటీసుల్లో ఈసీ ఆదేశించింది.
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ప్రధాన పార్టీల స్టార్ క్యాంపెయినర్లు చేస్తున్న ప్రసంగాలు గాడి తప్పుతున్నాయంటూ ఎన్నికల సంఘం (Elections Commision) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని (MCC) తూ.చ. తప్పకుండా పాటించేలా స్టార్ క్యాంపెయినర్లకు సూచించుకోవాలని బీజేపీ (BJP) జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కాంగ్రెస్ (Congress) జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు బుధవారంనాడు వేర్వేరు నోటీసుల్లో ఈసీ ఆదేశించింది.
Lok Sabha Elections: జాతీయ భద్రతతో రాజీనా?.. దీదీపై అమిత్‌షా నిప్పులు
ఎన్నికల ప్రచారాల్లో భారత రాజ్యాంగం రద్దవుతుందని, అమ్మేస్తారంటూ తప్పుదారి పట్టించే ప్రకటనలకు దూరంగా ఉండాలని కాంగ్రెస్‌ను ఆదేశించింది. కుల,మతపరమైన అంశాలకు దూరంగా ఉండాలని రెండు పార్టీలకు ఎన్నికల సంఘం సూచించింది. అగ్నివీర్ వంటి పథకాలపై ప్రసంగాలు చేసేటప్పుడు సాయుధ బలగాలను రాజకీయం చేయడం తగదని పేర్కొంది. ఎన్నికల ప్రచారంలో పార్టీలన్నీ బాధ్యతాయుతంగా వ్యవరించాలని, ఎన్నికల వ్యవస్థపై ఓటరుకు ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీసే ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసీ సహించదని స్పష్టం చేసింది. నేతల ప్రచార శైలిని సరిదిద్దుకునేలా, సంయమనం పాటించేలా వారికి తగిన సూచలనలివ్వాలని రెండు జాతీయ పార్టీల అధ్యక్షులకు ఈసీ సూచించింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..