Eknath Shinde: ఆసుపత్రి నుంచి షిండే డిశ్చార్జి.. నేరుగా అధికార నివాసానికి
ABN , Publish Date - Dec 03 , 2024 | 05:03 PM
షిండే గత వారం నుంచి జ్వరం, గొంతు ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్నారు. మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై ఢిల్లీలో చర్చల అనంతరం గత శుక్రవారంనాడు ముంబై చేరుకున్న ఆయన సతారా జిల్లాలోని తన స్వగ్రామానికి వెళ్లారు. అక్కడ అస్వస్థతకు గురయ్యారు.

ముంబై: మరో రెండు రోజుల్లో మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం కొలువు తీరనున్న నేపథ్యంలో అస్వస్థతకు గురై మంగళవారం ఉదయం థానేలోని జూపిటర్ ఆసుపత్రిలో చేరిన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే (Eknath Shinde) మధ్యాహ్నం డిశ్చార్జి అయ్యారు. వైద్యులు 'రొటీన్ చెకప్' పరీక్షల అనంతరం డిశ్చార్చ్ చేయడంతో ఆయన అధికారిక నివాసమైన వర్షా బంగ్లాకు చేరుకున్నారు.
Sheikh Hasina: బంగ్లాలో ఉచకోతల సూత్రధారి యూనుస్.. నిప్పులు చెరిగిని షేక్ హసీనా
షిండే గత వారం నుంచి జ్వరం, గొంతు ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్నారు. మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై ఢిల్లీలో చర్చల అనంతరం గత శుక్రవారంనాడు ముంబై చేరుకున్న ఆయన సతారా జిల్లాలోని తన స్వగ్రామానికి వెళ్లారు. అక్కడ అస్వస్థతకు గురికావడంతో కొత్త ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియకు సంబంధించి అసంతృప్తితో ఉన్నారంటూ ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే ఆ ఊహాగానాలను ఆయన కొట్టివేశారు. బీజేపీ కేంద్ర నాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తాను కట్టుబడి ఉంటానని వివరణ ఇచ్చారు.
చకచకా ఏర్పాట్లు
మరోవైపు, మహాయుతి ప్రభుత్వం ప్రమాణస్వీకారానికి ముంబైలోని ఆజాద్ మైదాన్ ముస్తా్బవుతోంది. డిసెంబర్ 5న జరిగే ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యే అవకాశం ఉంది. దీనికి ముందు డిసెంబర్ 4న బీజేపీ లెజిస్లేచర్ పార్టీ సమావేశం జరుగనుండగా, కేంద్ర పరిశీలకులుగా నిర్మలా సీతారామన్, విజయ్ రూపానీ హాజరవుతున్నారు. ఈ సమావేశంలో బీజేపీ లెజిస్లేచర్ పార్టీ నేతను ఏకగ్రీవంగా ఎన్నుకోనున్నారు. ఆయనే కొత్త సీఎంగా పగ్గాలు చేపడతారు. రెండోసారి సీఎం పదవిని షిండే ఆశించినప్పటికీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏకైక పెద్దపార్టీగా నిలిచింందున బీజేపీకే ఈసారి సీఎం పదవి దక్కాలని ఆ పార్టీ అధిష్ఠానం నిర్ణయంగా ఉంది. అధికారికంగా కొత్త సీఎం పేరు బీజేపీ లెజిస్లేచర్ పార్టీ సమావేశానంతరం బుధవారంనాడు ప్రకటించే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి
Supreme Court: బెయిలు వచ్చిన మరునాడే మంత్రి పదవా...
Heavy Rains: మూడు జిల్లాలను ముంచెత్తిన ‘ఫెంగల్’
మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..