Share News

Dhoni-Kohli: ఆ మెసేజ్ ఏంటో చెప్పను.. కోహ్లీకి పంపిన సందేశం గురించి ధోనీ ఆసక్తికర వ్యాఖ్యలు

ABN , Publish Date - Mar 24 , 2025 | 03:16 PM

మూడేళ్ల క్రితం స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఫామ్ కోల్పోయి తీవ్రంగా ఇబ్బందిపడ్డాడు. ఆ సమయంలో కెప్టెన్సీని కూడా వదిలేశాడు. ఆ సమయంలో ధోనీ తనకు ఇచ్చిన మద్దతు గురించి కోహ్లీ బహిరంగంగానే మాట్లాడాడు. ఆ సమయంలో ధోనీ ఒక్కడే తనకు మెసేజ్ చేశాడని కోహ్లీ వెల్లడించాడు.

Dhoni-Kohli: ఆ మెసేజ్ ఏంటో చెప్పను.. కోహ్లీకి పంపిన సందేశం గురించి ధోనీ ఆసక్తికర వ్యాఖ్యలు
dhoni with kohli

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli)కి మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ (MS dhoni)తో ఉన్న అనుబంధం గురించి తెలిసిందే. ముఖ్యంగా మూడేళ్ల క్రితం స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఫామ్ కోల్పోయి తీవ్రంగా ఇబ్బందిపడ్డాడు. ఆ సమయంలో కెప్టెన్సీని కూడా వదిలేశాడు. ఆ సమయంలో ధోనీ తనకు ఇచ్చిన మద్దతు గురించి కోహ్లీ బహిరంగంగానే మాట్లాడాడు. ఆ సమయంలో ధోనీ ఒక్కడే తనకు మెసేజ్ చేశాడని కోహ్లీ వెల్లడించాడు. ఆ మెసేజ్ గురించి తాజాగా ధోనీకి ఓ ప్రశ్న ఎదురైంది.


కోహ్లీకి పంపించిన ఆ మెసేజ్ ఎంటని ధోనీని ప్రశ్నంచగా.. తాను చెప్పనని ధోనీ సమాధానం చెప్పాడు. * అది నమ్మకానికి సంబంధించింది. ఆ మెసేజ్ ఏంటనేది నేను మాట్లాడలేను. కానీ, మా అనుబంధం గురించి మాట్లాడతా. చాలా మంది క్రికెటర్లు తమ మనసులోని మాటలను నాతో పంచుకుంటుంటారు. నేను బయటకు చెప్పనని వారికి నమ్మకం. నేను వాటిని ప్రైవేట్‌గానే ఉంచుతాను * అని ధోనీ చెప్పాడు. అలాగే కోహ్లీ గురించి కూడా ధోనీ మాట్లాడాడు. కోహ్లీతో తన స్నేహం ఎప్పటికీ పదిలంగా ఉంటుందని చెప్పాడు.


విరాట్ కోహ్లీ కేవలం 40, 50 పరుగులు చేస్తే చాలనుకుని సంతృప్తి చెందే మనిషి కాదని, సెంచరీ చేయడంతో పాటు చివరి వరకు క్రీజులో ఉండాలనే వ్యక్తి అని ధోనీ చెప్పాడు. బ్యాటింగ్‌లో చాలా మెరుగయ్యాడని, ఫిట్‌నెస్ విషయంలో కూడా స్ట్రిక్ట్‌గా ఉంటాడని పేర్కొన్నాడు. కోహ్లీ తనతో చాలా విషయాలు మాట్లాడతాడని, ఎప్పుడూ నిజాయితీగా తన అభిప్రాయం చెబుతానని చెప్పాడు. అందుకే తమ మధ్య అనుబంధం పెరిగిందని ధోనీ చెప్పుకొచ్చాడు.


ఇవి కూడా చదవండి..

MS Dhoni: ధోనీ రియాక్షన్ టైమ్ 0.12 సెకెన్లు.. అవాక్కైన మాజీ క్రికెటర్లు..


Virat Kohli - Rinku Singh: కోహ్లిని రింకూ సింగ్ అవమానించాడా.. వేదిక మీద షేక్ హ్యండ్ ఇవ్వకపోవడంతో చర్చ


MS Dhoni: నేను వీల్‌ఛైర్‌లో ఉన్నా.. సీఎస్కే వాళ్లు లాక్కెళ్తారు: ఎంఎస్ ధోనీ


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Mar 24 , 2025 | 03:17 PM