Share News

Viral Video: అనుకోని సంఘటన.. ఈమె చేసిన పనికి హ్యాట్సాఫ్ అనాల్సిందే..

ABN , Publish Date - Mar 24 , 2025 | 02:48 PM

ఆ మహిళ చేసిన పనికి సోషల్ మీడియా మొత్తం శభాష్ అంటోంది. ఆమెను పొగడ్తలతో ముంచెత్తుతోంది. మీరు చాలా గ్రేట్ మేడమ్.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: అనుకోని సంఘటన.. ఈమె చేసిన పనికి హ్యాట్సాఫ్ అనాల్సిందే..
delhi

ఈ మధ్య కాలంలో ఊబర్ కారు డ్రైవర్లకు.. కస్టమర్లకు మధ్య గొడవలు జరగటం బాగా ఎక్కువైంది. ముఖ్యంగా మహిళా కస్టమర్లు ఊబర్ డ్రైవర్లపై కంప్లైంట్లు చేయటం కూడా బాగా పెరిగిపోయింది. మొన్నీమధ్య ఊబర్ కారు డ్రైవర్‌కు.. ఓ మహిళ జర్నలిస్ట్‌కు మధ్య గొడవ జరిగింది. కేవలం 95 పైసల కోసం ఇద్దరూ గంటకుపైగా వాదులాడుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. నెటిజన్లు ఆ మహిళా జర్నలిస్ట్‌పై మండిపడ్డారు. ఇదంతా ఒక ఎత్తయితే.. తాజాగా ఓ మహిళ ఊబర్ డ్రైవర్‌కు చేసిన సాయానికి సోషల్ మీడియా మొత్తం హ్యాట్సాఫ్ చెబుతోంది. మీరు గ్రేట్ మేడమ్ అంటూ జనాలు ఆమెను తెగపొగిడేస్తున్నారు. ఇంతకీ ఆమె ఏం చేసిందంటే...


కొద్దిరోజుల క్రితం ఢిల్లీకి చెందిన ఓ మహిళ తన కుటుంబంతో కలిసి ఊబర్ కారు బుక్ చేసుకుని ఎక్కింది. కారు కొంత దూరం వెళ్లిన తర్వాత డ్రైవర్ ఆరోగ్యం బాగా క్షీణించింది. కారు నడపలేని పరిస్థితిలోకి వచ్చాడు. ఇది గుర్తించిన మహిళ కారు ఆపమని చెప్పింది. వేరే కారు బుక్ చేసుకుని వెళ్లిపోకుండా.. అతడ్ని వెనకాల సీట్లో కూర్చోబెట్టింది. తను కారు నడిపింది. తను వెళ్లాల్సిన చోటు వరకు కారును నడిపింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఆ మహిళ మాట్లాడుతూ.. ‘ నేను మీకు ఇచ్చే సందేశం ఏంటంటే.. మీరు కచ్చితంగా కారు నడపటం నేర్చుకోండి. ఇలాంటి పరిస్థితుల్లో పనికి వస్తుంది.


మీకు కారు నడపటం వస్తే వేరే వాళ్లకు సాయం చేయడానికి పనికి వస్తుంది’ అని అంది. ఇక, ఈ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు ఆ మహిళను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ‘అవును.. ఆమె చెప్పింది నూటికి నూరు శాతం వాస్తవం. అందరూ కచ్చితంగా డ్రైవింగ్ నేర్చుకోవాలి’... ‘ మీరు చాలా గ్రేట్ మేడమ్.. డ్రైవర్ ఆరోగ్యం గురించి ఇంత చక్కగా ఆలోచిస్తున్నారు. వేరే వాళ్లు అయితే కారు దిగి వెళ్లిపోతారు’..‘ ఇలాంటి వాళ్లు ఇంకా భూమ్మీద ఉన్నందుకే ఇంకా వానలు పడుతున్నాయి’.. ‘ ఈమె ఈ కాలం ఆడవాళ్లకు స్పూర్తిగా నిలుస్తున్నారు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఆడ కావచ్చు.. మగ కావచ్చు.. బైకు, కారు నడపటం కచ్చితంగా నేర్చుకోవాలి. లేదంటే ఇబ్బందులు పడాల్సి వస్తుంది.


ఇవి కూడా చదవండి:

Nagpur Riots Latest Update: నాగ్‌పూర్ అల్లర్లలో నిందితుడిపై మహా సర్కార్ రియాక్షన్ ఇదీ..

Navy Officer Case: డబ్బులు భర్తవి.. జల్సాలు ప్రియుడితో.. అక్కడితో ఆగకుండా

Delhi High Court: ప్రాథమిక ఆధారాలున్నాయి.. లోతైన దర్యాప్తు జరపాల్సిందే

Updated Date - Mar 24 , 2025 | 02:59 PM