Mahua Moitra: మహువా మొయిత్రాపై కొత్త క్రిమినల్ చట్టం కింద ఎఫ్ఐఆర్
ABN , Publish Date - Jul 07 , 2024 | 07:47 PM
కొద్దికాలం క్రితం పార్లమెంటు సభ్యత్వం కోల్పోయి తిరిగి 2024 ఎన్నికల్లో పార్లమెంటు సభ్యురాలిగా ఎన్నికైన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా మరోసారి చిక్కుల్లో పడ్డాడు. జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ చైర్‌పర్సన్ రేశా శర్మపై ఆమె ఇటీవల చేసిన తీవ్ర వ్యాఖ్యలపై ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.
న్యూఢిల్లీ: కొద్దికాలం క్రితం పార్లమెంటు సభ్యత్వం కోల్పోయి తిరిగి 2024 ఎన్నికల్లో పార్లమెంటు సభ్యురాలిగా ఎన్నికైన తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఎంపీ మహువా మొయిత్రా (Mahua Moitra) మరోసారి చిక్కుల్లో పడ్డాడు. జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ (NCW) చైర్‌పర్సన్ రేశా శర్మపై ఆమె ఇటీవల చేసిన తీవ్ర వ్యాఖ్యలపై ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేసింది. కొత్త క్రిమినల్ చట్టం భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సెక్షన్ 79 కింద ఈ కేసు నమోదైంది.
MHA: కోల్‌కతా కమిషనర్, డీసీపీపై కేంద్ర హోం శాఖ క్రమశిక్షణా చర్యలు..
రేఖాశర్మపై సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో మహువ మొయిత్రా ఇటీవల చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. హత్రాస్ తొక్కిసలాట జరిగిన ప్రాంతానికి రేఖాశర్మ వచ్చినప్పుడు ఓ వ్యక్తి ఆమెకు గొడుగు పట్టారు. రేఖా శర్మ తన సొంత గొడుకు ఎందుకు మోయలేకపోయారంటూ ఒక నెటిజన్ ప్రశ్నించడంతో.. ''ఆమె (రేఖాశర్మ) తన బాస్ పైజమాను పట్టుకోవడంలో బిజీగా ఉన్నారు'' అంటూ మొయిత్రా వ్యాఖ్యానించారు. ఆ తర్వాత ఆ ట్వీట్‌ను ఆమె తొలగించారు. అయితే మొయిత్రా వ్యాఖ్యలపై ఎన్‌సీడబ్ల్యూ కన్నెర్ర చేసింది. మొయిత్రాపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా, మొయిత్రా వ్యాఖ్యలపై 'ఎక్స్' హ్యాండిల్ నుంచి సమాచారం సేకరించి తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
Read Latest Telangana News and National News