Hatras: మొబైల్ బయటపెట్టిన అతిపెద్ద రహస్యం.. పోలీసులే షాక్..!
ABN , Publish Date - May 12 , 2024 | 02:19 PM
ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. 10 నెలల క్రితం ఓ డ్రైవర్ అదృశ్యమవగా.. అతను కనిపించకుండా పోవడానికి గల కారణం ఇప్పుడుు తేలింది. ఇంతకాలం పోలీసులు ఎంత వెతికినా కనిపెట్టలేకపోయారు. కానీ.. ఒక మొబైల్ ఫోన్ అసలు రహస్యాన్ని బట్టబయలు చేసింది. 10 నెలల కాలంగా ఆఫ్‌లో ఉన్న ఫోన్.. ఇప్పుడు ఆన్ కావడంతో..
లక్నో, మే 12: ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. 10 నెలల క్రితం ఓ డ్రైవర్ అదృశ్యమవగా.. అతను కనిపించకుండా పోవడానికి గల కారణం ఇప్పుడుు తేలింది. ఇంతకాలం పోలీసులు ఎంత వెతికినా కనిపెట్టలేకపోయారు. కానీ.. ఒక మొబైల్ ఫోన్ అసలు రహస్యాన్ని బట్టబయలు చేసింది. 10 నెలల కాలంగా ఆఫ్‌లో ఉన్న ఫోన్.. ఇప్పుడు ఆన్ కావడంతో.. అసలు మ్యాటర్ రివీల్ అయ్యింది. కనిపించకుండా పోయిన డ్రైవర్.. దారుణ హత్యకు గురైనట్లు తేలింది. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
హత్రాస్ గేట్ ప్రాంతంలోని సాకేత్ కాలనీకి చెందిన 40 ఏళ్ల అజయ్ పాఠక్ డ్రైవర్‌గా జీవనం సాగిస్తు్న్నాడు. చిన్న చిన్న వాహనాలు నడుపుతూ డబ్బులు సంపాదించేవాడు. అయితే, జూలై 16, 2023న తాను మధుర వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అలా వెళ్లిన అజయ్.. ఆ తర్వాత ఇంటికి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు అతని కోసం ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. సెప్టెంబర్ 5, 2023న అజయ్ అదృశ్యంపై కొత్వాలి హత్రాస్ గేట్ వద్ద మిస్సింగ్ ఫిర్యాదు నమోదైంది. అదృశ్యమైన వ్యక్తి కోసం పోలీసులు తీవ్రంగా గాలించారు. కానీ అజయ్ జాడ దొరకలేదు. అయినా పోలీసులు ఈ కేసును క్లోజ్ చేయలేదు. అయితే, ఇటీవల అజయ్ ఫోన్ ఆన్ అయ్యింది. వెంటనే పోలీసులు అలర్ట్ అయ్యారు. అసలేం జరిగిందా? అని కూపీ లాగగా.. అసలు విషయం రివీల్ అయ్యింది. లొకేష్ ట్రేస్ చేసి.. మొబైల్ వాడుతున్న యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తమదైన శైలిలో విచారించగా.. అసలు విషయం వెల్లడించాడు. అజయ్ దారుణ హత్యకు గురైనట్లు చెప్పాడు. అజయ్‌ని హత్య చేసి మృతదేహాన్ని ఆగ్రాలో పడేసినట్లు నిందితుడు పోలీసులకు తెలిపాడు. అతను ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులలు ఆగ్రాకు చేరుకున్నారు. అజయ్ శవాన్ని పాతిపెట్టిన ప్రదేశానికి చేరుకుని.. మృతదేహాన్ని వెలికితీశారు.
అజయ్ అస్తికలను స్వగ్రామానికి చేర్చిన కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. బాధిత కుటుంబ సభ్యుల పది నెలల ఎదురు చూపులు చివరకు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. అయితే, నిందితుడు అజయ్‌ను ఎందుకు చంపాడు అనే అంశంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు గల కారణాలు తెలియకపోవడంతో.. ఆ దిశగా నిందితుడిని విచారిస్తున్నారు.