Share News

ఖాళీ స్థలాలపై సంపద పన్ను వేయండి: ఎస్‌జేఎం

ABN , Publish Date - Jul 13 , 2024 | 03:44 AM

త్వరలోనే ప్రవేశ పెట్టనున్న కేంద్ర బడ్జెట్‌పై సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్‌ఎ్‌సఎస్‌ అనుబంధ విభాగం స్వదేశీ జాగరణ్‌ మంచ్‌ (ఎస్‌జేఎం)కొన్ని సూచనలు చేసింది.

ఖాళీ స్థలాలపై సంపద పన్ను వేయండి: ఎస్‌జేఎం

న్యూఢిల్లీ, జూలై 12: త్వరలోనే ప్రవేశ పెట్టనున్న కేంద్ర బడ్జెట్‌పై సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్‌ఎ్‌సఎస్‌ అనుబంధ విభాగం స్వదేశీ జాగరణ్‌ మంచ్‌(ఎ్‌సజేఎం) కొన్ని సూచనలు చేసింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో గత నెలలో భేటీ అయిన అశ్వినీ మహాజన్‌ నేతృత్వంలోని ఎస్‌జేఎం ప్రతినిధులు..

ఏఐ ఆధారిత సంస్థలపై రోబో ట్యాక్స్‌ విధించాలని సూచించారు. ఏఐ వినియోగంతో ఉద్యోగాలు కోల్పోయేవారికి పరిహారం కింద దీనిని చెల్లించవచ్చని పేర్కొన్నారు. అయితే.. సాంకేతికతను అడ్డుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు.

ఇలా వసూలు చేసే పన్నులను ఉద్యోగాలు కోల్పోయేవారు సరికొత్త సాంకేతికతలను నేర్చుకునేందుకు సాయం కింద అందించాలని సూచించారు. అదేవిధంగా ఖాళీ స్థలాలపై సంపద పన్ను విధించాలని, తద్వారా భూకబ్జాలను, ఆక్రమణలను కూడా తగ్గించేందుకు అవకాశం ఉంటుందని అన్నారు

Updated Date - Jul 13 , 2024 | 03:44 AM