Madhya Pradesh: పెళ్లికి నిరాకరించిందని మహిళను అపరహించిన యువకుడు.. ఆ తరువాత ఏం జరిగిందంటే..
ABN , Publish Date - Jan 25 , 2024 | 10:09 PM
Indore: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో దారుణం వెలుగు చూసింది. పెళ్లికి నిరాకరించిందనే కారణంతో ఓ మహిళపై సామూహిక అత్యాచారం చేశారు. ఆరు నెలల క్రితం ఈ ఘటన చోటు చేసుకోగా.. బాధిత మహిళ ఇప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంలో విషయం వెలుగులోకి వచ్చింది. కేసు ఫైల్ చేసిన పోలీసులు.. ఎనిమిది మంది నిందితులను అరెస్ట్ చేశారు.
ఇండోర్, జనవరి 25: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో దారుణం వెలుగు చూసింది. పెళ్లికి నిరాకరించిందనే కారణంతో ఓ మహిళపై సామూహిక అత్యాచారం చేశారు. ఆరు నెలల క్రితం ఈ ఘటన చోటు చేసుకోగా.. బాధిత మహిళ ఇప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంలో విషయం వెలుగులోకి వచ్చింది. కేసు ఫైల్ చేసిన పోలీసులు.. ఎనిమిది మంది నిందితులను అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఇండోర్‌లోని ద్వారకాపురికి చెందిన బాధిత మహిళ(23), అంకిత్ కదమ్ మంచి స్నేహితులు. ఈ పరిచయం నేపథ్యంలోనే.. కదమ్ ఆమెకు పెళ్లి ప్రపోజ్ చేశాడు. అయితే, ఈ ప్రపోజల్‌ను మహిళ తిరస్కరించింది. మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అయితే, సెప్టెంబర్ 2023లో కదమ్ ఆమెను అపహరించి ఇండోర్ డెవలప్‌మెంట్ అథారిటీ(ఐడీఏ) పాత భవనంలోకి తీసుకెళ్లాడు. అక్కడ అంకిత్ అతని స్నేహితులు 8 మంది కలిసి మహిళపై సామూహిక అత్యాచారం చేశారు. ఈ ఘటనను వీడియో తీసిన అంకిత్.. విషయాన్ని బయట చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరింపులకు పాల్పడ్డాడు. విషయాన్ని ఎవరికి చెప్పొద్దని వార్నింగ్ ఇచ్చారు. దీంతో బాధిత మహిళ ఆ దారుణాన్ని తన మనసులోనే దాచుకుంది. అయితే, నిందితుడు కదమ్ మరింత రెచ్చిపోయాడు. తనను కలవాలని మహిళను బలవంతం చేస్తూ వచ్చాడు. లేదంటే అత్యాచారం వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని, ఆమె చెల్లెలిని సైతం రేప్ చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో ఇక విసిగిపోయిన బాధిత మహిళ.. బుధవారం రాత్రి పోలీస్ స్టేషన్‌కు చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. జరిగిన విషయాన్ని పోలీసులకు పూసగుచ్చినట్లు వివరించింది.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వీరంతా 20 ఏళ్ల వయసువారేనని, రోజువారీ కూలీగా పని చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితులను కూడా పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. వారి మొబైల్స్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. నిందితులపై భారతీయ శిక్షాస్మృతిలోని 366, 376డి, 506 సెక్షనల కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.