Share News

IndiGo: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. టికెట్ ఛార్జీ తగ్గించిన ఇండిగో

ABN , Publish Date - Jan 04 , 2024 | 01:36 PM

ప్రయాణికులకు ఇండిగో (IndiGo) విమానయాన సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటివరకు ఉన్న ఫ్యూయల్ ఛార్జీలను టికెట్ల నుంచి తగ్గించింది. ఇండిగో (IndiGo) సంస్థ అధికార ప్రతినిధి ఒకరు గురువారం నాడు ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు. ఇటీవల ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ధరలను తగ్గాయి. దీంతో టికెట్లపై ఫ్యూయల్ ధరలను సంస్థ తగ్గించింది. దేశీయంగా, అంతర్జాతీయ రూట్లలో ఇంధన ధరలను వెనక్కి తీసుకుంటున్నామని ప్రకటించింది. తగ్గిన ధరలు ఈ రోజు నుంచి అమల్లోకి వస్తాయని స్పష్టంచేసింది.

 IndiGo: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. టికెట్ ఛార్జీ తగ్గించిన ఇండిగో

న్యూఢిల్లీ: ప్రయాణికులకు ఇండిగో (IndiGo) విమానయాన సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటివరకు ఉన్న ఫ్యూయల్ ఛార్జీలను టికెట్ల నుంచి తగ్గించింది. ఇండిగో (IndiGo) సంస్థ అధికార ప్రతినిధి ఒకరు గురువారం నాడు ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు. ఇటీవల ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ధరలను తగ్గాయి. దీంతో టికెట్లపై ఫ్యూయల్ ధరలను సంస్థ తగ్గించింది. దేశీయంగా, అంతర్జాతీయ రూట్లలో ఇంధన ధరలను వెనక్కి తీసుకుంటున్నామని ప్రకటించింది. తగ్గిన ధరలు ఈ రోజు నుంచి అమల్లోకి వస్తాయని స్పష్టంచేసింది.

3 నెలల క్రితం 2023 అక్టోబర్ నెలలో ఏటీఎఫ్ ధరలు పెరిగాయి. దీంతో ఇండిగో (IndiGo) తమ టికెట్లపై ధరలను పెంచాల్సి వచ్చింది. ఇప్పుడు తగ్గడంతో వెంటనే తగ్గించేసింది. తమ సంస్థ ఇచ్చిన వాగ్దానానికి కట్టుబడి ఉందని తెలిపింది. ఎయిర్ లైన్ నిర్వహణ ఖర్చులలో ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ భాగం అయ్యిందని.. అందుకోసమే గతంలో ఛార్జీలను పెంచి.. ఇప్పుడు తగ్గించామని వివరించింది. ఇండిగో విమానయాన సంస్థ తీసుకున్న నిర్ణయంపై ప్రయాణికులు హర్షం వ్యక్తం చేశారు.

Updated Date - Jan 04 , 2024 | 01:40 PM