Share News

S Jaishankar: హిందువుల రక్షణ బాధ్యత బంగ్లాదేశ్ ప్రభుత్వానిదే.. లోక్‌సభలో ప్రకటన

ABN , Publish Date - Nov 29 , 2024 | 06:51 PM

బంగ్లాదేశ్‌లో హిందువులు, మైనారిటీలపై జరుగుతున్న దాడులు, హింసాకాండపై జైశంకర్ లోక్‌సభలో శుక్రవారనాడు అడిగిన ఒక ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ, 2024 ఆగస్టు నుంచి హిందువులు, మైనారిటీలపై పలుమార్లు దాడులు జరిగిన ఘటనలు ప్రభుత్వం దృష్టికి వచ్చాయని చెప్పారు.

S Jaishankar: హిందువుల రక్షణ బాధ్యత బంగ్లాదేశ్ ప్రభుత్వానిదే.. లోక్‌సభలో ప్రకటన

న్యూఢిల్లీ: బంగ్లాదేశ్‌లో హిందువులతో సహా మైనారిటీల రక్షణ బాధ్యత మమహ్మద్ యూనుస్‌ సారథ్యంలోని అక్కడి తాత్కాలిక ప్రభుత్వానిదేనని భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ (S Jaishankar) అన్నారు. బంగ్లాదేశ్‌లో హిందువులు, మైనారిటీలపై జరుగుతున్న దాడులు, హింసాకాండపై లోక్‌సభలో శుక్రవారనాడు అడిగిన ఒక ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ, 2024 ఆగస్టు నుంచి హిందువులు, మైనారిటీలపై పలుమార్లు దాడులు జరిగిన ఘటనలు ప్రభుత్వం దృష్టికి వచ్చాయని చెప్పారు. ఇటీవల బంగ్లాదేశ్‌లో జరిగిన దుర్గా పూజోత్సవాల్లోనూ ఆలయాలు, పూజా మండపాలపై దాడులు జరిగినట్టు వార్తలు వెలువడ్డాయన్నారు. ఈ ఘటనలను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుని తమ ఆందోళనను బంగ్లాదేశ్ ప్రభుత్వానికి తెలియజేసినట్టు చెప్పారు.

Delhi Assembly Elections: 'ఆప్'తో పొత్తుకు నో.. ఒంటరి పోరుకు కాంగ్రెస్ నిర్ణయం


ఢాకాలోని హైకమిషన్ కార్యాలయం సైతం బంగ్లాదేశ్‌లో మైనారిటీల పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటోందని జైశంకర్ వివరించారు. బంగ్లాదేశ్‌ ప్రజల ప్రాణాలు, స్వేచ్ఛను పరిరక్షించాల్సిన ప్రధాన బాధ్యత ఆదేశ ప్రభుత్వానికి ఉందని స్పష్టం చేశారు. బంగ్లాదేశ్ ఇస్కాన్‌కు చెందిన చిన్మయ్ కృష్ణదాస్ బ్రహ్మచారిని బంగ్లాదేశ్ ప్రభుత్వం అరెస్టు చేయడం, దీనిపై తీవ్ర నిరసనలు పెల్లుబికిన నేపథ్యంలో జైశంకర్ లోక్‌సభలో తాజా ప్రకటన చేశారు.


బంగ్లాదేశ్ జాతీయ జెండా కంటే ఎత్తులో కాషాయం జెండాను ఎగురవేశారనే ఆరోపణను కృష్ణదాస్ ఎదుర్కొంటున్నారు. చిన్మయ్ దాస్ అరెస్టు, బెయిల్ మంజూరు చేయకపోవడంతో ఆయనను విడుదలచేయాలంటూ అటు బంగ్లాలోనే కాకుండా ఇండియాలోనూ నిరసనలు, ఆందోళనలు వ్యక్తమయ్యాయి. చిన్మయ్ దాస్ అరెస్టుపై ఐక్యరాజ్యసమితి తక్షణం జోక్యం చేసుకోవాలని ఇస్కాన్ సంస్థ కోరింది. ఈ విషయంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జోక్యం చేసుకోవాలని ఇండియాలోని పలు పార్టీలు విజ్ఞప్తి చేసాయి. బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా సైతం చిన్మయ్ దాస్ అరెస్టును తప్పుపట్టారు. తక్షణం ఆయనను విడుదల చేయాలని కోరారు.


ఇవి కూడా చదవండి

CWC Meet: ఎన్నికల ఫలితాలు ఓ సవాల్.. ఐక్యంగా పార్టీని బలోపేతం చేయాలి: ఖర్గే దిశానిర్దేశం

Maharashtra: కొనసాగుతున్న సస్పెన్స్.. కీలక సమావేశం రద్దు, సొంత గ్రామానికి షిండే

Karnataka: ముస్లింల ఓటు హక్కుపై వివాదం.. విశ్వ ఒక్కలిగ మహాసంస్థాన మఠం స్వామీజీపై కేసు

Chennai: హాయిగా ఊపిరి పీల్చుకోండి..

Updated Date - Nov 29 , 2024 | 06:51 PM