Temples: ఆలయాల్లో గన్నేరు పూల వాడకంపై నిషేధం.. కారణం తెలిస్తే వాడి జోలికి వెళ్లరు
ABN , Publish Date - May 10 , 2024 | 10:11 AM
కేరళలోని ప్రధాన ఆలయాల్లో గన్నేరు పూలను నిషేధించారు. రాష్ట్రంలోని మెజారిటీ దేవాలయాలను నిర్వహించే కేరళలోని రెండు ప్రధాన ఆలయ బోర్డులు ట్రావెన్‌కోర్ దేవస్వోమ్ బోర్డు (TDB), మలబార్ దేవస్వోమ్ బోర్డు (MDB)లు పవిత్రంగా భావించే గన్నేరు పూలను నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
తిరువనంతపురం: కేరళలోని(Kerala) ప్రధాన ఆలయాల్లో గన్నేరు పూలను నిషేధించారు. రాష్ట్రంలోని మెజారిటీ దేవాలయాలను నిర్వహించే కేరళలోని రెండు ప్రధాన ఆలయ బోర్డులు ట్రావెన్‌కోర్ దేవస్వోమ్ బోర్డు (TDB), మలబార్ దేవస్వోమ్ బోర్డు (MDB)లు పవిత్రంగా భావించే గన్నేరు పూలను నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
గన్నేరు పూలల్లో ప్రాణులకు హాని కలిగించే విషపూరిత పదార్థాలు ఉన్నాయనే భయాందోళనల నడుమ ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీడీబీ అధ్యక్షుడు ప్రశాంత్ చెప్పారు. ఆలయాల్లో గన్నేరు పూలకు బదులు తులసి, తేచి, రోజా పూలను సమర్పించాలని సూచించారు.
"టీడీబీ ఆధ్వర్యంలోని దేవాలయాలలో నైవేద్యాలు, ప్రసాదాలలో అరళీ పూలను పూర్తిగా నిషేధించాం. వాటికి బదులు తులసి, తేచి (ఇక్సోరా), మల్లె, మందార, గులాబీ వంటి ఇతర పూలను దేవుడికి సమర్పించవచ్చు" అని సూచించారు. ఎండీపీ అధ్యక్షుడు మురళీ మాట్లాడుతూ.. అరళీ పూలలో విషపూరిత పదార్థాలు ఉన్నట్లు పలు అధ్యయనాల్లో తేలిందని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
ట్రావెన్‌కోర్ కేరళలోని 1,248 ఆలయాలను నిర్వహించే బాధ్యత టీడీబీకి అప్పగించబడింది. ఎండీబీ 1,400 దేవాలయాలను నిర్వహిస్తోంది. అలప్పుజాలో ఇటీవల ఒక మహిళ గన్నేరు పూలు, ఆకులు తిని మృతి చెందిందనే వార్తలు వచ్చాయి.
రెండు రోజుల క్రితం పతనంతిట్టలో ఓ గోవు, దూడ గన్నేరు పూలు తిని మరణించాయి. కొన్ని అధ్యయనాల ప్రకారం గన్నేరు పూలు, ఆకుల్లో ఒలియాండర్‌లు, కార్డెనోలైడ్‌లు ఉంటాయని తేలింది. ఇవి మానవులు, జంతువుల హృదయంపై తీవ్ర ప్రభావం చూపుతాయట. తద్వారా ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతుందని వైద్యులు చెబుతున్నారు.
Read Latest News and National News Click Here..