Share News

MHA: కోల్‌కతా కమిషనర్, డీసీపీపై కేంద్ర హోం శాఖ క్రమశిక్షణా చర్యలు..

ABN , Publish Date - Jul 07 , 2024 | 06:05 PM

ఎన్నికల అనంతరం చెలరేగిన హింసాకాండలో బాధితులు తనను కలుసుకోకుండా కోల్‌కతా పోలీసులు అడ్డుకున్నారంటూ పశ్చిమబెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ గత వారంలో సమర్పించిన నివేదికపై కేంద్రం హోం శాఖ చర్యలకు ఉపక్రమించింది.

MHA: కోల్‌కతా కమిషనర్, డీసీపీపై కేంద్ర హోం శాఖ క్రమశిక్షణా చర్యలు..

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ (West Bengal)లోని అధికార తృణమూల్ కాంగ్రెస్ (TMC)ప్రభుత్వానికి, గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ (CV Ananda Bose)కు మధ్య విభేదాలు మరింత ముదురుతున్నాయి. ఎన్నికల అనంతరం చెలరేగిన హింసాకాండలో బాధితులు తనను కలుసుకోకుండా కోల్‌కతా పోలీసులు అడ్డుకున్నారంటూ గవర్నర్ గత వారంలో కేంద్ర హోం శాఖ (MHA)కు నివేదిక సమర్పించారు. దీనిపై కోల్‌కతా పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్, డీసీపీ ఇందిరా ముఖర్జీపై ఎంహెచ్ఏ క్రమశిక్షణా చర్యలకు ఉపక్రమించింది.

Armstrong burial: పార్టీ కార్యాలయంలో ఆర్మ్‌స్ట్రాంగ్ భౌతికకాయాన్ని ఖననం చేసేందుకు హైకోర్టు నిరాకరణ


ఐపీఎస్ అధికారులు గవర్నర్ కార్యాలయం ప్రతిష్టను దిగజారుస్తున్నారని, ఉద్దేశపూర్వకంగానే ప్రవర్తనా నియమావళికి పాల్పడుతున్నారని గవర్నర్ తన నివేదికలో హోం శాఖకు ఫిర్యాదు చేశారు. ఎన్నికల అనంతర హింసాకాండ బాధితులు తనను కలుసుకోవాలని అనుకోవడంతో తాను అంగీకరించానని, అయినప్పటికీ తనను కలుసుకోకుండా పోలీసులు వారిని అడ్డుకున్నారని ఎంహెచ్ఏకు ఆయన నివేదించారు. కాగా, గవర్నర్ సమర్పించిన సమగ్ర నివేదక ఆధారంగా ఐపీఎస్ అధికారులపై చర్యలను ఎంహెచ్ఏ చేపట్టిందని, ఇందుకు సంబంధించిన లేఖ ప్రతులను జూలై 4న మమతా బెనర్జీ ప్రభుత్వానికి పంపిందని అధికారులు తెలిపారు. కాగా, రాజ్‌భవన్ కార్యాలయం వద్ద నియమించిన పోలీసులు అధికారులపై కూడా గవర్నర్ తన నివేదికలో ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. గత ఏప్రిల్-మేలో గవర్నర్ కార్యాలయంపై తప్పుడు ఆరోపణలు చేసేలా ఒక మహిళా ఉద్యోగిని పోలీసులు ప్రోత్సహించినట్టు సీవీ బోస్ ఫిర్యాదు చేశారని చెబుతున్నారు.

Read Latest Telangana News and National News

Updated Date - Jul 07 , 2024 | 06:23 PM