MUDA Case: సీఎంకు హైకోర్టు నోటీసు
ABN , Publish Date - Nov 05 , 2024 | 02:41 PM
స్నేహమయి కృష్ణ వేసిన ఈ పిటిషన్‌పై కేంద్రం ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, సీబీఐ, లోకాయుక్త పోలీసులకు హైకోర్టు నోటీసులు పంపింది. లోకాయుక్త పోలీసులు ఇంతవరకూ చేసిన దర్యాప్తునకు సంబంధించిన వివరాలను నవంబర్ 25వ తేదీలోగా తమకు సమర్పించాలని కూడా కోర్టు కోరింది.
బెంగళూరు: ముడా (MUDA) భూముల కేటాయింపు కేసు కీలక మలుపులు తిరుగుతోంది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah), ఆయన భార్య, ఇతరులపై నమోదైన ఈ కేసును సీబీఐ (CBI)కి బదిలీ చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై కర్ణాటక హైకోర్టు సిద్ధరామయ్యకు మంగళవారంనాడు నోటీసులు పంపింది. స్నేహమయి కృష్ణ వేసిన ఈ పిటిషన్‌పై కేంద్రం ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, సీబీఐ, లోకాయుక్త పోలీసులకు హైకోర్టు నోటీసులు పంపింది. లోకాయుక్త పోలీసులు ఇంతవరకూ చేసిన దర్యాప్తునకు సంబంధించిన వివరాలను నవంబర్ 25వ తేదీలోగా తమకు సమర్పించాలని కూడా కోర్టు కోరింది. తదుపరి విచారణను నవంబర్ 26న తేదీకి వాయిదా వేసింది.
MUDA Case: సీఎంకు లోకాయుక్త పోలీసులు సమన్లు
ముడా భూముల కేటాయింపుల వ్యవహారంపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని సెప్టెంబర్ 27న కోర్టు ఇచ్చిన ఆదేశాలతో మైసూరు లోకాయుక్త పోలీసులు అధికారికంగా కేసుపై దర్యాప్తు జరుపుతున్నారు. సిద్ధరామయ్య భార్యకు రూ.56 కోట్లు విలువచేసే 14 స్థలాలను ముడా కేటాయించడంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై లోకాయుక్త విచారణ జరుపుతోంది. మైసూరు సిటీలోని ఖరీదైన ప్రాంతంలో అక్రమంగా సిద్ధరామయ్య భార్యకు 14 స్థలాలను ముడా కేటాయించినట్టు ఆరోపణలుున్నాయి. కేసు విచారణలో భాగంగా ఇటీవల సిద్ధరామయ్య భార్య పార్వతిని ముడా పోలీసులు ప్రశ్నించారు. ఈనెల 6వ తేదీన తమ ముందు హాజరుకావాలని సిద్ధరామయ్యకు సైతం మైసూరు లోకాయుక్త సోమవారంనాడు నోటీసులు పంపింది. నోటీసులు తనకు అందాయని, 6వ తేదీన విచారణకు హాజరవుతానని సిద్ధరామయ్య ధ్రువీకరించారు.
ముడాకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఎన్‌పోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సైతం అక్టోబర్ 28న మంగళూరు, బెంగళూరు, మాండ్య, మైసూరు సహా కర్ణాటకలోని ఆరు చోట్ల గాలింపు చర్యలు చేపట్టింది. ముడాతో అసోసియేషన్ ఉన్న ఆరుగురు ఉద్యోగులకు సమన్లు పంపింది. సిద్ధరామయ్య, ఆయన భార్యతో సహా పలువురిపై మనీ లాండిరింగ్ కింద ఈడీ కేసు నమోదు చేసింది.
ఇవి కూడా చదవండి..
CM Stalin: మా పాలన గొప్పతనం తెలుసుకోండి
Supreme Court of India: మదర్సాలపై కీలక తీర్పునిచ్చిన సుప్రీంకోర్టు..
మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..