Mumbai: ఇల్లు విక్రయించిన సల్మాన్ సోదరి.. కారణమేమంటే.. ?
ABN , Publish Date - Oct 20 , 2024 | 08:37 PM
సల్మాన్ ఖాన్ సినిమా షూటింగ్ సందర్భంగా రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ వెళ్లారు. షూటింగ్ విరామ సమయంలో సల్మాన్ ఖాన్ వేటకు వెళ్లారు. ఆ సమయంలో కృష్ణ జింకను సల్మాన్ ఖాన్ కాల్చి చంపారు. బిష్ణోయ్ తెగ వారు కృష్ణ జింకను ఆరాధిస్తారు. ఈ నేపథ్యంలో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్.. సల్మాన్‌పై పగ పెంచుకున్న సంగతి తెలిసిందే.
మంబయి, అక్టోబర్ 20: బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ సోదరి ఆర్మితా ఖాన్ శర్మ ముంబయిలోని తన నివాసాన్ని విక్రయించారు. ఆ మహానగరంలో అత్యంత ప్రముఖ ప్రాంతాల్లో ఒకటైన ఖార్ వెస్ట్‌లో ఫ్లైయింగ్ కార్పెట్ బెల్డింగ్‌లోని అపార్ట్‌మెంట్‌ను ఆమె విక్రయించింది. ఈ అపార్ట్‌మెంట్‌ను రూ. 22 కోట్లకు ఆర్పితా ఖాన్ శర్మ విక్రయించినట్లు సమాచారం. ఈ అపార్ట్‌మెంట్ విక్రయానికి సంబంధించిన లావాదేవీలన్నీ అక్టోబర్ 10వ తేదీన పూర్తయినట్లు తెలుస్తుంది. ఈ అపార్ట్‌మెంట్ విక్రయం వేళ.. ప్రభుత్వానికి స్టాంప్ డ్యూటీ కింద రూ. 1.32 కోట్లు చెల్లించారు.
Viral Video: అక్కడ అమ్మాయి..ఇక్కడ అబ్బాయి.. ఆన్‌లైన్‌లో పెళ్లి
అలాగే రిజిస్ట్రేషన్ ఛార్జీలు రూ.30 వేలు అయ్యాయి. ఆర్పిత శర్మ అపార్ట్‌మెంట్‌ను శివాయ సినీవైజ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కొనుగోలు చేసింది. జింఖానా క్లబ్, కార్టర్ రోడ్డు, పాలీ హిల్స్ ప్రాంతంలో ఉన్న ఈ అపార్ట్‌మెంట్ సమీపంలోనే ప్రముఖ నటులు షారూక్ ఖాన్, సల్మాన్ ఖాన్, రణభీర్ కపూర్ నివాసాలున్నాయి. అయితే 2017లో ఈ అపార్ట్‌మెంట్‌ను ఆర్మితా ఖాన్ శర్మ రూ. 18 కోట్లకు ఈ ఇల్లు కొనుగోలు చేశారు. ఇక ఇదే అపార్ట్‌మెంట్‌లో 2022లో మరో నివాసాన్ని ఆర్పిత ఖాన్ శర్మ కొనుగోలు చేశారు. ఇది 1750 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఇంటిని రూ. 10 కోట్లలో ఆమె కొనుగోలు చేసింది.
Also Read: BSNL Vs Jio: జియోను వెనక్కి నెట్టిన బీఎస్ఎన్ఎల్.. మరికొద్ది రోజుల్లో..
మరోవైపు ఇటీవల సల్మాన్ ఖాన్‌కు బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఈ నేపథ్యంలో సల్మాన్ నివాసం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. తమతో ఉన్న వైరానికి ముంగిపు పలకాలంటే రూ. 5 కోట్లు తమకు సల్మాన్ ఖాన్ చెల్లించాలని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ డిమాండ్ చేసింది. ఓ వేళ నగదు చెల్లించకుంటే.. మాజీ మంత్రి బాబా సిద్దిఖీ హత్య కంటే దారుణమైన పరిస్థితులు సల్మాన్ ఎదుర్కొవలసి ఉంటుందని బిష్ణోయ్ గ్యాంగ్ హెచ్చరించింది. అందుకు సంబంధించిన సందేశాన్ని ముంబయి ట్రాఫిక్ పోలీసుల వాట్సప్ నెంబర్‌కు బిష్ణోయ్ గ్యాంగ్ పంపింది.
Also Read: Flipkart: ఫ్లిప్‌కార్ట్‌లో సేల్స్ ప్రారంభం.. ఐ ఫోన్ 15 ధర ఎంతంటే..?
Also Read: Secunderabad Bandh: సికింద్రాబాద్‌లో బంద్.. ఆందోళనకారులపై కేసు నమోదు
మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్దిఖీని ఆయన కుమారుడు, బాంద్రా పశ్చిమ ఎమ్మెల్యే జీషన్ సిద్దిఖీ కార్యాలయం వద్ద దుండగులు కాల్చి చంపారు. ఈ హత్యకు సంబంధించిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ హత్య తామే చేశామని బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించింది. స్లమ్ ఏరియాకు సంబంధించిన వివాదమే బాబా సిద్దిఖీ హత్యకు ప్రధాన కారణమని పోలీసులు భావిస్తున్నారు.
Also Read: HYDRA: హైడ్రా చీఫ్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు
Also Read: ఉలవలు ఆహారంగా తీసుకోవడం వల్ల.. ఇన్ని ప్రయోజనాలున్నాయా..?
సల్మాన్ ఖాన్ సినిమా షూటింగ్ సందర్భంగా రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ వెళ్లారు. షూటింగ్ విరామ సమయంలో సల్మాన్ ఖాన్ వేటకు వెళ్లారు. ఆ సమయంలో కృష్ణ జింకను సల్మాన్ ఖాన్ కాల్చి చంపారు. బిష్ణోయ్ తెగ వారు కృష్ణ జింకను ఆరాధిస్తారు. ఈ నేపథ్యంలో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్.. సల్మాన్‌పై పగ పెంచుకున్న సంగతి తెలిసిందే.
For National News And Telugu News