Share News

National Security: బాంబు బెదిరింపుల ఘటనలపై పోలీస్ సదస్సు.. పాల్గొననున్న ప్రధాని, హోంమంత్రి

ABN , Publish Date - Nov 23 , 2024 | 07:35 AM

ఇంటెలిజెన్స్ బ్యూరో నిర్వహించే వార్షిక సదస్సులో మొదటిసారిగా బాంబు బెదిరింపుల అంశంపై చర్చించనున్నారు. వచ్చే వారం జరగనున్న ఈ బేటీకి ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సహా అన్ని రాష్ట్రాల అధికారులు హాజరుకానున్నారు.

National Security: బాంబు బెదిరింపుల ఘటనలపై పోలీస్ సదస్సు.. పాల్గొననున్న ప్రధాని, హోంమంత్రి
pm modi amit shah attend IB

వచ్చే వారం నవంబర్ 29 నుంచి డిసెంబర్ 1 వరకు భువనేశ్వర్‌లో డైరెక్టర్స్ జనరల్ ఆఫ్ పోలీస్ సదస్సు జరగనుంది. అయితే ఈ సమావేశంలో తొలిసారిగా విమానాలు, హోటళ్లలో పెరుగుతున్న బాంబు బెదిరింపు ఘటనలను ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనుండటం విశేషం. ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) నిర్వహించే ఈ వార్షిక సదస్సులో ఈసారి అంతర్గత భద్రతకు సంబంధించిన సవాళ్ల గురించి కూడా చర్చించనున్నారు. దీంతోపాటు తీసుకున్న నిర్ణయాల గురించి కూడా చర్చిస్తారు. ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ(narendra modi), హోంమంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సహా అన్ని రాష్ట్రాల కేంద్ర బలగాల డైరెక్టర్ జనరల్స్ పాల్గొంటారు.


కుట్ర ఉందని

ఈ సమావేశంలోనే మొదటిసారిగా విమానాలు, హోటళ్లు సహా పలు చోట్ల బాంబుల బెదిరింపుల గురించి చర్చకు రానుంది. ఇది దేశ అంతర్గత భద్రతకు కొత్త సవాలుగా పరిగణించబడుతుందని ఓ సీనియర్ అధికారి అన్నారు. ఈ బెదిరింపుల కారణంగా పెద్ద ఎత్తున నష్టం వచ్చినట్లు చెప్పారు. ఆ క్రమంలో పలు విమానాలలో సోదాలు చేయడం వంటి కారణాలతో విమానాలు ఆలస్యం కావడంతో ఎయిర్‌లైన్‌కు రూ. 3 కోట్లకుపైగా నష్టం వచ్చిందని గుర్తు చేశారు. అయితే ఒకే రోజులో డజన్ల కొద్దీ విమానాలు, హోటళ్లకు నకిలీ బాంబు బెదిరింపులు వచ్చిన తీరుపై కుట్ర దాగి ఉందని భావిస్తున్నట్లు వెల్లడించారు.

సహజంగానే భద్రతా సంస్థలు దీన్ని భారత ఆర్థిక ప్రయోజనాలను దెబ్బతీసే కుట్రగా చూస్తున్నాయి. ఇలాంటి పుకార్లను ఎదుర్కోవడానికి ఇప్పటి వరకు సరైన చట్టం లేదని సీనియర్ అధికారి తెలిపారు. ప్రస్తుతం ఇలాంటి బాంబు బెదిరింపులకు పాల్పడడం అనేది గుర్తించదగిన నేరం కాదని, నిందితులకు తక్షణమే బెయిల్ ఇస్తున్నారని కూడా ప్రస్తావించారు.


క్రిమినల్ గ్యాంగ్‌ల విషయంలో..

పౌర విమానయాన శాఖ మంత్రి రామ్ మోహన్ నాయుడు దీనిని గుర్తించదగిన నేరంగా పరిగణించి, కఠినంగా శిక్షించేలా చట్టంలో సవరణలను ప్రకటించారు. ఈ సమస్యను పరిష్కరించడానికి, కఠినమైన చట్టాలతో సహా ఇతర చర్యలను వివరంగా చర్చించవచ్చని సీనియర్ అధికారి తెలిపారు. దీంతో పాటు, విదేశాల నుంచి వచ్చి భారతదేశంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న క్రిమినల్ గ్యాంగ్‌ల కార్యకలాపాలు, డ్రగ్స్ స్మగ్లర్లు, ఉగ్రవాద సంస్థలతో క్రిమినల్ గ్యాంగ్‌ల సంబంధాల గురించి కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు.


ఆన్‌లైన్ మోసాల గురించి కూడా..

ఈ అంశంపై ఇప్పటికే సదస్సులో చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నామని, ఆ నిర్ణయాల అమలుపై పోలీసు డైరెక్టర్ జనరల్ సమర్పించిన నివేదికపై చర్చించి తదుపరి వ్యూహాన్ని నిర్ణయిస్తామని సీనియర్ అధికారి తెలిపారు. దీంతో పాటు, కంబోడియా, లావోస్, మయన్మార్ నుంచి నిర్వహించబడుతున్న సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాల వల్ల ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కోవటానికి చర్యలు కూడా చర్చించబడతాయి. సైబర్ మోసం, పెరుగుతున్న సవాళ్లపై హోం మంత్రిత్వ శాఖలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ద్వారా వివరణాత్మక ప్రదర్శన ఉంటుంది. దీంతోపాటు వాటిని ఎదుర్కోవటానికి చర్యల గురించి చర్చించబడతాయి.


ఇవి కూడా చదవండి:

Bank Holidays: వచ్చే నెలలో 17 రోజులు బ్యాంకులు బంద్.. కారణమిదే..


Personal Finance: నెలకు రూ. 5 వేలు సేవ్ చేస్తే.. రూ. 2 కోట్ల కోసం ఎన్నేళ్లు కట్టాలి..

Aadit Palicha: చదువు, జాబ్ వదిలేసి స్టార్టప్ పెట్టాడు.. ఇప్పుడు రూ.4300 కోట్ల సంపదకు..

Read More National News and Latest Telugu News

Updated Date - Nov 23 , 2024 | 07:53 AM