CPM లైనింగ్ పనులను అడ్డుకున్న సీపీఎం నాయకులు
ABN , Publish Date - Apr 02 , 2025 | 12:18 AM
మండలంలోని ఎం.కొట్టాల సమీపంలో హంద్రీనీవా కాలువ లైనింగ్ పనులను సీపీఎం, రైతు సంఘం నాయకులు మంగళవారం అడ్డుకున్నారు.

ముదిగుబ్బ, ఏప్రిల్ 1(ఆంధ్రజ్యోతి): మండలంలోని ఎం.కొట్టాల సమీపంలో హంద్రీనీవా కాలువ లైనింగ్ పనులను సీపీఎం, రైతు సంఘం నాయకులు మంగళవారం అడ్డుకున్నారు. హంద్రీనీవా కాలువకు లైనింగ్ పనులు కాకుండా, కాలువ వెడల్పు చేయాలని, లైనింగ్ పనులు చేయడం వలన భూగర్భ జలాలు ఎండిపోతాయని, రైతులు తీవ్రంగా నష్టపోతారని అన్నారు. హంద్రీనీవా కాలువను వెడల్పు చేసి ఉమ్మడి జిల్లాలో ఉన్న చెరువులన్నింటికి నేరుగా నీరు ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో సత్యసాయి జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు హరి, ప్రధాన కార్యదర్శి జంగాలపల్లి పెద్దన్న, మారుతి మండల సీపీఎం కార్యదర్శి ఆటో పెద్దన్న, పోతలయ్య, పక్కీరప్ప, సుధాకర్, వెంకటనారాయణ పాల్గొన్నారు.