Share News

Rains: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. రెండు రోజులు భారీ వర్షసూచన

ABN , Publish Date - Dec 17 , 2024 | 10:51 AM

దక్షిణ బంగాళాఖాతంలోని మధ్య ప్రాంతంలో తాజాగా అల్పపీడనం ఏర్పడిందని, ఇది మరో రెండు రోజుల్లో మరింత బలపడి సముద్రతీర జిల్లాల వైపు పశ్చిమ వాయువ్య దిశగా పయనించనున్నదని వాతావరణ కేంద్రం వెల్లడించింది.

Rains: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. రెండు రోజులు భారీ వర్షసూచన

చెన్నై: దక్షిణ బంగాళాఖాతంలోని మధ్య ప్రాంతంలో తాజాగా అల్పపీడనం ఏర్పడిందని, ఇది మరో రెండు రోజుల్లో మరింత బలపడి సముద్రతీర జిల్లాల వైపు పశ్చిమ వాయువ్య దిశగా పయనించనున్నదని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ అల్పపీడనం కారణంగా రానున్న రెండు రోజుల్లో నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

ఈ వార్తను కూడా చదవండి: Pollution: ఢిల్లీలో మరోసారి గ్రాఫ్ 4 పై ఆంక్షలు..

ABN ఛానల్ ఫాలో అవ్వండి

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా సోమవారం దక్షిణ బంగళాఖాతం మధ్య ప్రాంతంలో ఓ అల్పపీడనం రూపుదిద్దుకుందని, అది బలపడి పడమర, వాయువ్య దిశలలో సముద్రతీర ప్రాంతాల వైపుగా కదులుతుందని, ఇప్పటికే దీని ప్రభావంతో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో, పుదుచ్చేరి, కారైక్కాల్‌ ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిశాయని అధికారులు వివరించారు.


మంగళవారం పుదుచ్చేరి, కారైక్కాల్‌(Puducherry, Karaikal) ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో భారీ వర్షాలు కురుస్తాయని, ఇదే విధంగా చెంగల్పట్టు, విల్లుపురం, కడలూరు, మైలాడుదురై(Chengalpattu, Villupuram, Cuddalore, Mylapore) జిల్లాల్లో కొన్ని చోట్ల చెదురుమదురుగా వర్షాలు కురువనున్నాయి. చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం(Chennai, Tiruvallur, Kanchipuram), తిరువారూరు, నాగపట్టినం జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు.


nani1.2.jpg

ఇదే రీతిలో బుధవారం చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు, కడలూరు, విల్లుపురం జిల్లాల్లో పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురువనున్నాయి. సముద్రతీర ప్రాంతాల్లో మూడు రోజుపాటు గంటకు 35 నుండి 45 కి.మీ.ల వేగంతో పెనుగాలులు వీస్తాయని తెలిపారు.


ఈవార్తను కూడా చదవండి: చలి.. పులి.. నగరంలో పడిపోయిన ఉష్ణోగ్రతలు

ఈవార్తను కూడా చదవండి: Konda Surekha: రాములోరి భక్తులకు అసౌకర్యం కలగొద్దు

ఈవార్తను కూడా చదవండి: Farmer Insurance: రైతు బీమా నగదు కాజేసిన ఏఈవో

ఈవార్తను కూడా చదవండి: NDWA: నదుల అనుసంధానంపై కేంద్రం భేటీ 19న

Read Latest Telangana News and National News

Updated Date - Dec 17 , 2024 | 10:57 AM

News Hub