Share News

DK Shivakumar: డీకేకు సుప్రీంకోర్టులో చుక్కెదురు

ABN , Publish Date - Jul 15 , 2024 | 03:18 PM

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఆ కేసులో సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను కొట్టివేసేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది.

DK Shivakumar: డీకేకు సుప్రీంకోర్టులో చుక్కెదురు

న్యూఢిల్లీ: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (DK Shivakumar)కు సుప్రీంకోర్టు (Supreme court)లో చుక్కెదురైంది. ఆ కేసులో సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ (FIR)ను కొట్టివేసేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌ను సుప్రీంకోర్టులో డీకే సవాలు చేశారు. దీనిని సుప్రీంకోర్టు తోసిపుచ్చుతూ, కర్ణాటక హైకోర్టు ఆదేశాల్లో తాము జోక్యం చేసుకోవాలని అనుకోవడం లేదని పేర్కొంది. ''సార్..డిస్మిస్డ్''అంటూ జస్టిస్ బెల త్రివేది, జస్టిస్ సతీష్ చంద్ర శర్మతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.

Kashi Viswanath Dham: కాశీ విశ్వనాథ దేవాలయంలోకి క్యూఆర్ కోడ్‌తో ఎంట్రీ


కేసు ఏమిటి?

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సీబీఐ ఎఫ్ఐఆర్‌ను కొట్టివేయాలంటూ డీకే వేసిన పిటిషన్‌ను 2023 అక్టోబర్ 19న కర్ణాటక హైకోర్టు తోసిపుచ్చింది. కేసు విచారణను పూర్తి చేసి మూడు నెలల్లోగా నివేదికను సమర్పించాలని సీబీఐని ఆదేశించింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న డీకే 2013-2018 మధ్య ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని సీబీఐ అభియోగం. దీనిపై 2020 సెప్టెంబర్ 3న సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. 2021లో ఈ ఎఫ్ఐఆర్‌ను హైకోర్టులో డీకే శివకుమార్ సవాలు చేశారు.

For Latest News and National News click here

Updated Date - Jul 15 , 2024 | 03:18 PM