Uttarakhand: అక్రమ మసీదు కూల్చివేత.. ఉద్రిక్తత.. వాహనాలకు నిప్పు..
ABN , Publish Date - Feb 09 , 2024 | 08:34 AM
ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మించిన మసీదు కూల్చివేత ఉద్రిక్తతకు దారి తీసింది. వాహనాలకు నిప్పు పెట్టడంతో పలు వెహికిల్స్ కాలి బూడిదయ్యాయి. ఈ ఘటన ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో జరిగింది.
ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మించిన మసీదు కూల్చివేత ఉద్రిక్తతకు దారి తీసింది. వాహనాలకు నిప్పు పెట్టడంతో పలు వెహికిల్స్ కాలి బూడిదయ్యాయి. ఈ ఘటన ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో జరిగింది. నగరంలోని బంబుల్‌పురా పోలీస్ స్టేషన్ పరిధిలోని మాలిక్ గార్డెన్ లో అక్రమంగా నిర్మిస్తున్న మసీదును మునిసిపల్ అధికారులు జేసీబీ సహాయంతో కూల్చివేశారు. దీంతో తీవ్ర కోపొద్రిక్తులైన స్థానికులు అధికారుల తీరుపై ఫైర్ అయ్యారు. పోలీసులు, జర్నిలిస్టులపై రాళ్లు రువ్వారు. పలు వాహనాలకు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి.
ఉద్రిక్తత అనంతరం పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు పోలీసు బలగాలు మోహరించాయి. అల్లర్లను ఆపేందుకు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఈ ఘటనపై డీజీపీ అభినవ్‌కుమార్ స్పందించారు. పరిస్థితిని అదుపు చేసే పనిలో నిమగ్నమై ఉన్నామని, త్వరలోనే చక్కదిద్దుతామని చెప్పారు. అక్రమ మదర్సాలు, నమాజ్ స్థలాలు పూర్తిగా చట్టవిరుద్ధమని అన్నారు.
ఈ స్థలానికి సమీపంలో మునిసిపల్ కార్పోరేషన్ గతంలో మూడెకరాల భూమిని స్వాధీనం చేసుకుంది. అయితే మదర్సా, నమాజ్ స్థలాన్ని సీల్ చేసింది. ఈ క్రమంలో ఆ స్థలంలో మదర్సా నిర్మిస్తుండగా దానిని అధికారులు కూల్చివేశారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది.
"మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి"