Share News

Viral Video: ఒక్క రూపాయితో ఉద్యోగాన్ని ఊడగొట్టుకున్న ఉద్యోగి

ABN , Publish Date - Sep 18 , 2024 | 09:11 AM

కమ్యూనిటి హెల్త్ సెంటర్‌లో ఓ రోగి నుంచి రూ.1 అధికంగా వసూల్ చేశాడనే ఆరోపణల నేపథ్యంలో కాంట్రాక్ట్ ఉద్యోగిని విధుల నుంచి ప్రభుత్వం తొలగించింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌, మహారాజ్‌గంజ్ జిల్లాలోని జగదౌర్ గ్రామంలో చోటు చేసుకుంది.

Viral Video: ఒక్క రూపాయితో ఉద్యోగాన్ని ఊడగొట్టుకున్న ఉద్యోగి

లఖ్‌నవూ, సెప్టెంబర్ 18: కమ్యూనిటి హెల్త్ సెంటర్‌లో ఓ రోగి నుంచి రూ.1 అధికంగా వసూల్ చేశాడనే ఆరోపణల నేపథ్యంలో కాంట్రాక్ట్ ఉద్యోగిని విధుల నుంచి ప్రభుత్వం తొలగించింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌, మహారాజ్‌గంజ్ జిల్లాలోని జగదౌర్ గ్రామంలో చోటు చేసుకుంది. ప్రభుత్వాసుపత్రుల్లో సిబ్బంది ఆలక్ష్యంగా ఉంటున్నారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో సివ్వా ఎమ్మెల్యే, బీజేపీ నేత ప్రేమ్ సాగర్ పటేల్.. జగదౌర్ గ్రామంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో సోమవారం ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో ఫార్మసిస్ట్.. తన వద్ద నుంచి రూ.1 అధికంగా వసూల్ చేశాడంటూ ఎమ్మెల్యే పటేల్‌కు ఓ రోగి ఫిర్యాదు చేశాడు. దీంతో ఆ ఫార్మసిస్ట్‌పై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు.

PM Modi US Tour: ప్రధాని మోదీని కలుస్తా: డొనాల్డ్ ట్రంప్


అనంతరం ఈ అంశాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్లారు. జిల్లా వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు వెంటనే స్పందించి.. సదరు కాంట్రాక్ట్ ఉద్యోగిని విధుల నుంచి తొలగించారు. అయితే ఒక్క రూపాయి అధికంగా వసూల్ చేసిన కాంట్రాక్ట్ ఉద్యోగిని ఎమ్మెల్యే నిలదీస్తున్న ఓ వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.


కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తాయి. ఆ ఆసుపత్రుల్లో రూ. 1కే రోగులకు మందులు విక్రయిస్తారు. అయితే కాంట్రాక్ట్ ఉద్యోగి.. రోగి నుంచి రూ.2 వసూల్ చేశాడు. ఈ తనిఖీల సందర్బంగా ఆసుపత్రిలోని రోగులతో బీజేపీ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ పటేల్ మాట్లాడారు.


ఈ ఆసుపత్రిలోని ప్రసూతి కేంద్రంలో రాత్రి వేళల్లో మహిళా వైద్యులు లేరని రోగులు, వారి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారన్నారు. అలాగే ఆసుపత్రిలో వైద్యులు రాసిన మందులు బయట కొనుగోలు చేయాల్సి వస్తుందని రోగులు ఆవేదన వ్యక్తం చేశారని చెప్పారు. ఈ అంశాన్ని జిల్లా వైద్యాధికారుల దృష్టికి తీసుకు వెళ్తామని ఎమ్మెల్యే పటేల్ ఈ సందర్భంగా వెల్లడించారు.

For More National News and Telugu News

Updated Date - Sep 18 , 2024 | 10:24 AM