Share News

SRH vs DC IPL 2025 Live Updates: డీసీ బ్యాటింగ్ షురూ..

ABN , First Publish Date - Mar 30 , 2025 | 12:20 PM

SRH vs DC IPL 2025 Live Updates in Telugu: సన్ రైజర్స్ హైదరాబాద్, ఢిల్టీ క్యాపిటల్స్‌ మధ్య హోరాహోరీ పోరు సాగనుంది. రెండూ బలమైన టీమ్స్ కావడంతో ఈ మ్యాచ్‌పై అభిమానుల్లో భారీ హైప్స్ నెలకొన్నాయి. మ్యాచ్‌కు సంబంధించి బాల్ టు బాల్ అప్‌డేట్‌ను ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది..

SRH vs DC IPL 2025 Live Updates: డీసీ బ్యాటింగ్ షురూ..
SRH vs DC

Live News & Update

  • 2025-03-30T18:43:36+05:30

    • సన్‌రైజర్స్‌పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది ఢిల్లీ క్యాపిటల్స్.

    • మరో 24 బంతులు ఉండగానే విక్టరీ కొట్టింది. 16 ఓవర్లలో 166 పరుగులతో మ్యాచ్‌ను ముగించింది.

    • అభిషేక్ పోరెల్ (34 నాటౌట్), ట్రిస్టన్ స్టబ్స్ (21 నాటౌట్) డీసీని గెలుపు తీరాలకు చేర్చారు.

  • 2025-03-30T18:23:37+05:30

    • కొత్త కుర్రాడు జీషన్ అన్సారీ మరోమారు మ్యాజిక్ చేశాడు.

    • డీసీ స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ (5 బంతుల్లో 15)ను కూడా అతడు వెనక్కి పంపాడు.

    • ఇప్పటివరకు డీసీ 3 వికెట్లు కోల్పోగా.. అన్నీ అన్సారీకే దక్కాయి.

    • జీషన్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు రాహుల్.

  • 2025-03-30T18:14:22+05:30

    • ఢిల్లీకి మరో షాక్ తగిలింది. ఇంకో ఓపెనర్ జేక్ ఫ్రేజర్ మెక్‌గర్క్ (32 బంతుల్లో 38) కూడా ఔట్ అయ్యాడు.

    • డుప్లెసిస్‌ను ఔట్ చేసిన అన్సారీనే మెక్‌గర్క్‌కూ పెవిలియన్ దారి చూపించాడు. ప్రస్తుతం డీసీ స్కోరు 10 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 101.

  • 2025-03-30T18:10:33+05:30

    • డీసీ తొలి వికెట్ కోల్పోయింది. స్పిన్నర్ జీషాన్ అన్సారీ సన్‌రైజర్స్‌కు బ్రేక్ త్రూ అందించాడు.

    • జోరు మీదున్న డుప్లెసిస్‌ (27 బంతుల్లో 50)ను అన్సారీ ఔట్ చేశాడు.

    • ఢిల్లీ విజయానికి ఇంకా 63 బంతుల్లో 78 పరుగులు కావాలి.

  • 2025-03-30T18:06:57+05:30

    • డుప్లెసిస్ హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు.

    • 26 బంతుల్లో అర్ధ శతకం మార్క్‌ను అందుకున్నాడు డుప్లెసిస్.

  • 2025-03-30T17:58:41+05:30

    • ఢిల్లీ క్యాపిటల్స్ ఛేజింగ్‌ను గ్రాండ్‌గా స్టార్ట్ చేసింది.

    • డీసీ ఓపెనర్లు ఫేజర్ మెక్‌గర్క్ (15 నాటౌట్), ఫాఫ్ డుప్లెసిస్ (43 నాటౌట్) దూకుడుగా ఆడుతున్నారు.

    • డుప్లెసిస్ ధనాధన్ షాట్లతో సన్‌రైజర్స్ బౌలర్లపై విరుచుకుపడుతున్నాడు. ఇప్పటికే 3 ఫోర్లు, 3 సిక్సులతో అతడు దుమ్మురేపాడు.

    • కెప్టెన్ ప్యాట్ కమిన్స్ సహా ఏ ఎస్‌ఆర్‌హెచ్ బౌలర్ కూడా డుప్లెసిస్‌ను ఆపలేకపోతున్నారు.

  • 2025-03-30T17:15:40+05:30

    ఎస్ఆర్‌హెచ్ ఆలౌట్..

    • 18.4 ఓవర్లకే ఎస్ఆర్‌హెచ్ ఆలౌట్ అయ్యింది.

    • టాప్‌ఆర్డర్ అంతా వరుసగా వికెట్లు సమర్పించుకోవడంతో చాలా తక్కువ స్కోర్ నమోదు చేసింది.

    • ఈ సీజన్‌లోనే తక్కువ స్కోర్ 163 నమోదు చేసింది.

    • డీసీకి 164 పరుగల లక్ష్యాన్ని ముందుంచింది.

  • 2025-03-30T16:58:28+05:30

    8వ వికెట్ కోల్పోయిన ఎస్ఆర్‌హెచ్..

    • అనికేత్ వర్మ ఔట్ అయ్యాడు.

    • 41 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సులతో 74 పరుగులు చేశాడు.

    • ఎస్ఆర్‌హెచ్ స్కోర్.. 149/8

  • 2025-03-30T16:44:56+05:30

    కమిన్స్ ఔట్..

    • ఎస్ఆర్‌హెచ్ కెప్టెన్ కమిన్స్ కూడా ఇలా వచ్చి అలా వెళ్లిపోయాడు.

    • భారీషాట్ కొట్టబోయే క్యాచ్ ఔట్ అయ్యాడు.

    • 7 బంతులాడి 2 పరుగులు మాత్రమే చేశాడు.

    • ఎస్ఆర్‌హెచ్ స్కోర్ 123/7

    • 14 ఓవర్లు పూర్తి.

  • 2025-03-30T16:38:07+05:30

    ఎస్ఆర్‌హెచ్ ఆశలు ఆవిరైనట్లే కనిపిస్తోంది.

    • అభినవ్ కూడా ఔట్ అయ్యాడు.

    • 6 వికెట్‌గా అభినవ్ పెవిలియన్ బాటపట్టాడు.

  • 2025-03-30T16:37:10+05:30

    మోహిత్ వేసిన బాల్‌ను క్లాసెన్ షాట్ కొట్టాడు. ఈ బాల్‌ను విప్రజ్ సూపర్ క్యాచ్ పట్టాడు. దీంతో క్లాసెన్ పెవిలియన్ బాటపట్టాడు. క్లాసెన్ 19 బంతుల్లో 2 సిక్సర్లు, 2 ఫోర్లతో 32 పరుగులు చేశాడు.

    SRH Score: 119/5

  • 2025-03-30T16:19:34+05:30

    ఎస్ఆర్‌హెచ్ స్కోర్..

    • వరుసగా వికెట్లు సమర్పించుకున్నప్పటికీ.. స్కోర్ పరంగా దూసుకుపోతుంది.

    • ఎస్ఆర్‌హెచ్ ప్రస్తుత స్కోర్ 96/4, ఓవర్లు - 8

  • 2025-03-30T16:18:03+05:30

    నాలుగో వికెట్ కోల్పోయిన ఎస్ఆర్‌హెచ్..

  • 2025-03-30T15:52:54+05:30

    30కే మూడు వికెట్లు డౌన్..

  • 2025-03-30T15:37:57+05:30

    డీసీ టీమ్ ఇదే..

  • 2025-03-30T15:37:25+05:30

    ఎస్ఆర్‌హెచ్ టీమ్ ఇదే..

  • 2025-03-30T15:36:38+05:30

    టాస్ గెలిచిన ఎస్ఆర్‌హెచ్..

  • 2025-03-30T14:00:44+05:30

    విశాఖకు అమిత్ షా కుమారుడు జై షా

    • విశాఖ చేరుకున్న జైషా, నారా లోకేష్

    • విశాఖలో ఢిల్లీ, హైదరాబాద్ జట్ల మధ్య ఐపీఎల్ మ్యాచ్

    • మ్యాచ్ చూసేందుకు విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న బీసీసీఐ చైర్మెన్ జై షా

    • విశాఖ విమానాశ్రయం చేరుకున్న ఏపీ మంత్రి నారా లోకేష్

    • విశాఖ విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గాన స్టేడియానికి బయలుదేరిన మంత్రి లోకేష్

  • 2025-03-30T13:31:59+05:30

    కాసేపట్లో టాస్

    • 3 గంటలకు టాస్

    • 3.30 గంటలకు మ్యాచ్

    • సన్ రైజర్స్ టాస్ గెలిచే ఛాన్స్ ఉందంటూ అంచనా

  • 2025-03-30T13:25:49+05:30

    రెండో విజయం కోసం

    రెండో విజయం కోసం ఢిల్లీ, హైదరాబాద్

    ఇప్పటివరకు ఒక మ్యాచ్ ఆడిన ఢిల్లీ

    లక్నోపై అనూహ్య విజయం

    లక్నోపై అదరగొట్టిన అశుతోష్ శర్మ

    గెలవదనుకున్న ఢిల్లీకి గెలుపు అందించిన అశుతోష్, విపరాజ్ నిగమ్

    అశుతోష్‌ వెరీ డేంజర్ అంటున్న క్రికెట్ ఫ్యాన్స్

    అశుతోష్‌ను కట్టడి చేస్తే విజయం ఈజీ అవుతుందనే లెక్కల్లో ఎస్‌ఆర్‌ఎచ్

  • 2025-03-30T12:20:49+05:30

    కాసేపట్లో విశాఖ వేదికగా మ్యాచ్

    • విశాఖ వేదికగా హైదరాబాద్ వర్సెస్ ఢిల్లీ మ్యాచ్

    • సొంత గ్రౌండ్‌లో ఆడనున్న నితీష్ రెడ్డి

    • నితీష్ రెడ్డిపై ఎస్‌ఆర్‌హెచ్ ఫ్యాన్స్ భారీ ఆశలు