Share News

Wayanad landslides: వయనాడ్ మృతుల సామూహిక ఖననం.. సర్వమత ప్రార్థనలు

ABN , Publish Date - Aug 05 , 2024 | 08:25 PM

వయనాడ్‌‌లో జూలై 30న కొండచరియల ఉత్పాతంలో ప్రాణాలు కోల్పోయిన వారికి జిల్లా యంత్రాంగం సోమవారంనాడు సామూహిక ఖననం నిర్వహించింది. యావద్దేశాన్ని కలిచివేసిన వయనాడ్‌ ఘటనలో గుర్తుపట్టని మృతదేహాల శరీర భాగాలను జిల్లాలోని పుదుమల ప్రాంతంలో పూడ్చిపెట్టారు.

Wayanad landslides: వయనాడ్ మృతుల సామూహిక ఖననం.. సర్వమత ప్రార్థనలు

వయనాడ్: వయనాడ్‌‌లో జూలై 30న కొండచరియల ఉత్పాతంలో ప్రాణాలు కోల్పోయిన వారికి జిల్లా యంత్రాంగం సోమవారంనాడు సామూహిక ఖననం (mass burial ceremony) నిర్వహించింది. యావద్దేశాన్ని కలిచివేసిన వయనాడ్‌ ఘటనలో గుర్తుపట్టని మృతదేహాల శరీర భాగాలను జిల్లాలోని పుదుమల ప్రాంతంలో పూడ్చిపెట్టారు. మృతుల ఆత్మలకు శాంతికలగాలని కోరుకుంటూ ఖననం నిర్వహించిన చోటే సర్వమత ప్రార్థనలు జరిపారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి ఈకార్యక్రమం మొదలైంది. ఎన్ని విడి భాగాలను ఖననం చేశామనేది లెక్కించ లేదని, ఎవరూ గుర్తించని శరీర భాగాలు కావడంతో సామూహిక ఖననం నిర్వహించామని కేరళ మంత్రి కేఎన్ బాలగోపాల్ తెలిపారు. మృతదేహాల గాలింపు, సహాయక చర్యలు ఏడవరోజు కూడా కొనసాగుతున్నట్టు చెప్పారు.

Viral News: బాధితులను కాపాడిన వయనాడ్ సూపర్ హీరో గల్లంతు.. తిరిగివస్తాడా?


308కి చేరిన మృతుల సంఖ్య

కాగా, ఆగస్టు 2వ తేదీ నాటికి మృతుల సంఖ్య 308కి చేరినట్టు ఆరోగ్య మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. 220 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని, మరో 180 మంది జాడ గల్లంతైందని పేర్కొంది. సహాయక చర్యల్లో భాగంగా వయనాడ్‌లో 53 క్యాంపులు ఏర్పాటు చేశారు. 6,759 మందిని ఇంతవరకూ ఈ సహాయ శిబిరాలకు తరలించారు. మెప్పాడి, ఇతర గ్రామ పంచాయతీలలో 9 షెల్టర్లు, 7 రెస్క్యూ క్యాంపులు ఏర్పాటు చేశారు. 2,514 మందిని సహాయక శిబిరాలకు తరలించారు. దీనికి అదనంగా పలు పాఠాశాలలు, కాలేజీల్లోనూ సహాయక శిబిరాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

For Latest News and National News click here

Updated Date - Aug 05 , 2024 | 08:25 PM