Mamata Banerjee: వారే దాడి చేసి వారే ఆరోపణలు చేస్తున్నారు.. మమతా స్ట్రాంగ్ కౌంటర్..
ABN , Publish Date - Apr 18 , 2024 | 03:36 PM
ముర్షిదాబాద్ ఘటన ముందస్తు ప్రణాళికతో జరిగిందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ( Mamata Banerjee )మండిపడ్డారు. ఈ ఘటనకు బీజేపీ నేతలే కారణమని ఆరోపించారు. రాయ్‌గంజ్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆమె సంచలన కామెంట్లు చేశారు.
ముర్షిదాబాద్ ఘటన ముందస్తు ప్రణాళికతో జరిగిందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ( Mamata Banerjee )మండిపడ్డారు. ఈ ఘటనకు బీజేపీ నేతలే కారణమని ఆరోపించారు. రాయ్‌గంజ్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆమె సంచలన కామెంట్లు చేశారు. రామనవమి ఊరేగింపుపై బీజేపీ నేతలే దాడి చేశారని అన్నారు. ఆయుధాలతో రామనవమి ఊరేగింపు చేసే అనుమతి ఎవరిచ్చారని నిలదీశారు. ఈ ఘటనలో 19 మంది గాయపడ్డారన్నారు. ఘటన జరగడానికి ముందురోజే ముర్షిదాబాద్ డీఐజీను ఎందుకు తొలగించారని ప్రశ్నించారు. ఆయన స్థానంలో కమిషన్ జాయింట్ కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్న సయ్యద్ వకార్ రజాను నియమించారని వివరించారు. బీజేపీ హింసను ప్రేరేపించిందని సీఎం మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Trending: ప్రపంచ వారసత్వ దినోత్సవం అంటే ఏమిటి.. ఈ ఇంట్రెస్టింగ్ విషయాలు మీకోసం..
“రామనవమి సందర్భంగా జరిగిన దాడి అందరికీ తెలిసిందే. ఈ ఘటనలో పోలీసులకూ గాయాలయ్యాయి. ఒక మతానికి చెందిన వ్యక్తులపై దాడి జరిగింది. కానీ టీఎంసీనే హింసకు పాల్పడిందని బీజేపీ ఆరోపించింది." అని మమతా బెనర్జీ చెప్పుకొచ్చారు. పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సుకాంత్ మజుందార్ రామనవమి ఊరేగింపుపై టీఎంసీ వ్యక్తులు దాడి చేశారని ఆరోపించారు. ప్రజలను రెచ్చగొట్టేందుకు సీఎం మమతా బెనర్జీ ప్రయత్నించారని ఫైర్ అయ్యారు. దీనిపై ఎన్‌ఐఏ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.
Elections 2024: నామినేషన్ల పర్వంలో పోలీసుల అత్యుత్సాహం.. మీడియాకూ నో ఎంట్రీ..
ముర్షిదాబాద్ జిల్లాలో రామ నవమి ఊరేగింపుపై జరిగిన దాడిలో నలుగురికి గాయాలయ్యాయి. శక్తిపూర్ రామ్ నవమి ఉత్సవ్ కమిటీ నిర్వహించిన ఊరేగింపు ముర్షిదాబాద్‌లోని శక్తిపూర్ హైస్కూల్ వద్ద నుంచి వెళ్తున్న సమయంలో దాడి జరిగింది. ఆందోళనకారులు రాళ్లు రువ్వినట్లు బాధితులు తెలిపారు. ఈ ఘటనపై బెంగాల్ వ్యాప్తంగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. సీఎం మమత అండతో హిందువులపై దాడులు జరుగుతున్నాయని మండిపడుతున్నారు.
మరిన్ని జాతీయం వార్తల కోసం క్లిక్ చేయండి.