Share News

పేదల కోసం ఆవిర్భవించిన టీడీపీ

ABN , Publish Date - Mar 29 , 2025 | 11:22 PM

తెలుగు దేశం పేదల కోసం ఆవిర్భవించిందని ఎమ్మెల్యే శ్యాం బాబు అన్నారు. శనివారం పట్టణంలోని మార్కెట్‌ యార్డ్‌ వద్ద ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళి అర్పించారు. అనంతరం సుంకంగేట్‌, తేరుబజార్‌ ప్రాంతాల్లో పార్టీ జెండాను ఆవిష్కరించారు. స్థాపించిన ఏడాదిలోపే ఎన్టీఆర్‌ పార్టీని ఆధికారంలోకి తెచ్చారని గుర్తుచేశారు.

 పేదల కోసం ఆవిర్భవించిన టీడీపీ
పత్తికొండలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే శ్యాంబాబు

నియోజకవర్గాల్లో ఘనంగా టీడీపీ ఆవిర్బావ దినోత్సవ వేడుకలు

పత్తికొండ, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): తెలుగు దేశం పేదల కోసం ఆవిర్భవించిందని ఎమ్మెల్యే శ్యాం బాబు అన్నారు. శనివారం పట్టణంలోని మార్కెట్‌ యార్డ్‌ వద్ద ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళి అర్పించారు. అనంతరం సుంకంగేట్‌, తేరుబజార్‌ ప్రాంతాల్లో పార్టీ జెండాను ఆవిష్కరించారు. స్థాపించిన ఏడాదిలోపే ఎన్టీఆర్‌ పార్టీని ఆధికారంలోకి తెచ్చారని గుర్తుచేశారు. పేదవాడి ఆకలి తీర్చేందుకు రూ.2కే కిలో బియ్యం పథకం ప్రవేశపెట్టారన్నారు. తుగ్గలి నాగేంద్ర, సురేష్‌ కుమార్‌, ప్రమోద్‌కుమార్‌ రెడ్డి, రామానాయుడు, బత్తిని వెంకట్రాముడు, తిమ్మయ్య చౌదరి, కడవ లసుధాకర్‌, సింగం శ్రీనివాసులు పాల్గొన్నారు.

ఆదోని: పట్టణంలోని పార్టీ కార్యాలయంలో టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. పార్టీ నాయకుడు ఉమాపతి నాయుడు, రామస్వామి పార్టీ జెండా ఎగురవేశారు. అనంతరం ఎన్టీఆర్‌ చిత్ర పటానికి నివాళి అర్పించారు. రంగస్వామి నాయుడు, మల్లికార్జున రెడ్డి, రామన్న గౌడ్‌, మహదేవప్ప, రాము, గూలెప్ప కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

పెద్ద హరివాణంలో కురువ కార్పొరేషన్‌ చైర్మన్‌ మాన్వి దేవేంద్రప్ప పార్టీ జెండాను ఆవిష్కరిం చి. ఎన్టీఆర్‌ చిత్రపటానికి నివాళులర్పించారు. బసవరాజు, నాగరాజు పాల్గొన్నారు.

బడుగుల పార్టీ టీడీపీ

ఆలూరు: బడుగు, బలహీన వర్గాల పార్టీ టీడీపీ అని, అందుకే ఎన్టీఆర్‌ తెలుగు దేశంను స్థ్థాపించారని ఆ పార్టీ ఆర్గనైజింగ్‌ కార్యదర్శి వైకుంఠం శివప్రసాద్‌, వైకుంఠం జ్యోతి అన్నారు. శనివారం ఆలూరులో దినోత్సవం వేడుకలను నిర్వహించారు. జీవన్‌ కుమార్‌, సీనప్స్‌, కృష్ణ యాదవ్‌, విశ్వ పాల్గొన్నారు.

ప్రజలకు మేలు చేసేది టీడీపీ అని ఇన్‌చార్జి వీరభద్రగౌడ్‌ అన్నారు. కార్యాలయం వద్ద ఎన్టీఆర్‌ చిత్రపటానికి నివాళి అర్పించి, పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మెయిన్‌ బజార్‌లో వేడుకలను నిర్వహిం చారు. కన్వీనర్‌ అశోక్‌, సాలి సాహెబ్‌, నరసప్ప, కొమ్ము రామాం జినేయులు, సోమశేఖర్‌, గూళ్యం రామాంజినేయులు, మసాలా జగన్‌, రాము యాదవ్‌, అంజి, బొగ్గుల ఈరన్న, వన్నూర్‌ వల్లి, అంజి రెడ్డి, వెంకటేష్‌, గుండయ్య పాల్గొన్నారు.

Updated Date - Mar 29 , 2025 | 11:22 PM