ఘనంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవం
ABN , Publish Date - Mar 29 , 2025 | 11:24 PM
నగరంలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో శనివారం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవాన్ని జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళి
జెండా ఎగురవేసిన ప్రజాప్రతినిధులు, నాయకులు
కర్నూలు అర్బన్, మార్చి 29(ఆంధ్రజ్యోతి): నగరంలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో శనివారం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవాన్ని జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ కార్యాలయం, కలెక్టరేట్ ఎదుట ఉన్న ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. తిక్కారెడ్డితో పాటు ఎంపీ బస్తిపాటి నాగరాజు, ఎమ్మెల్సీ బీటీ నాయుడు, ఎమ్మెల్యేలు గౌరు చరితారెడ్డి, బొగ్గుల దస్తగిరి, ‘కుడా’ చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ నివాళి అర్పించారు. పార్టీ కార్యాలయం ఎదుట పార్టీ జెండాను ఎగురవేశారు. నాయకులు, కార్యకర్తలు బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. తిక్కారెడ్డి మాట్లాడుతూ టీడీపీని నందమూరి తారక రామారావు స్థాపించిన నాటి నుంచి ఎందరో కార్యకర్తలు పార్టీ జెండా మోస్తూనే ఉన్నారని, అలాంటి వారందరికీ పార్టీ తప్పక ఒక భరోసా ఇస్తోందని అన్నారు. ఎంపీ బస్తిపాటి మాట్లాడుతూ తన లాంటి సామాన్యుడిని ఎంపీ సీటు ఇవ్వడం టీడీపీకే సాధ్యమైందని అన్నారు. సోమిశెట్టి మాట్లాడుతూ పార్టీ ఈ రోజు ఈ స్థాయిలో ఉందంటే కార్యకర్తలు, నాయకులకు ఇచ్చే గౌరవం, వారి నుంచి సమస్యలను తెలుసుకుని ఎప్పటికప్పుడు పార్టీని బలోపేతం చేయగల సత్తా ఉన్న నాయకుడైన చంద్రబాబుకే సాధ్యమని అన్నారు. ఎమ్మెల్సీ బీటీ నాయుడు మాట్లాడుతూ పార్టీ కోసం విశ్వాసంతో పనిచేసే నాయకులు, కార్యకర్తలకు అధిష్ఠానం గుర్తింపు ఇస్తోందని అన్నారు. కేఈ ప్రభాకర్ మాట్లాడుతూ పార్టీ అధినేత అడుగు జాడల్లో పయనించినప్పడే పార్టీ ఎదుగుదలతో పాటు ఈ చెట్టు నీడన ఎందరో నాయకులు, కార్యకర్తలు ఫలాలు తీంటున్నామని చెప్పడానికి జిల్లాలో వచ్చిన పదవులే ఇందుకు నిదర్శనమని అన్నారు. ఆవిర్భావం నుంచి పార్టీకి సేవలు అందిస్తున్న సీనియర్ నాయకులను సన్మానించారు. కార్యక్రమంలో పలు కార్పొరేషన్‌ల డైరెక్టర్లు పోతురాజు రవికుమార్, నంద్యాల నాగేంద్ర, థరూర్ జేమ్స్, రాష్ట్ర కార్యదర్శులు వై. నాగేశ్వరావు యాదవ్, వాహిద్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకెపోగు ప్రభాకర్, తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు అబ్బాస్, నగర అధ్యక్షుడు నాగరాజు యాదవ్, కేవీ సుబ్బారెడ్డి, కార్పొరేటర్ కైపా పద్మలతారెడ్డి, కేఈ జగదీష్, చంద్రకాంత్, మల్లెల పుల్లారెడ్డి, హనుమంతరావు చౌదరి, పేరుపోగు రాజు తదితరులు పాల్గొన్నారు. నీడన ఎందరో నాయకులు, కార్యకర్తలు ఫలాలు తీంటున్నామని చెప్పడానికి జిల్లాలో వచ్చిన పదవులే ఇందుకు నిదర్శనమని అన్నారు. ఆవిర్భావం నుంచి పార్టీకి సేవలు అందిస్తున్న సీనియర్ నాయకులను సన్మానించారు. కార్యక్రమంలో పలు కార్పొరేషన్‌ల డైరెక్టర్లు పోతురాజు రవికుమార్, నంద్యాల నాగేంద్ర, థరూర్ జేమ్స్, రాష్ట్ర కార్యదర్శులు వై. నాగేశ్వరావు యాదవ్, వాహిద్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకెపోగు ప్రభాకర్, తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు అబ్బాస్, నగర అధ్యక్షుడు నాగరాజు యాదవ్, కేవీ సుబ్బారెడ్డి, కార్పొరేటర్ కైపా పద్మలతారెడ్డి, కేఈ జగదీష్, చంద్రకాంత్, మల్లెల పుల్లారెడ్డి, హనుమంతరావు చౌదరి, పేరుపోగు రాజు తదితరులు పాల్గొన్నారు.