Share News

Srisailam News: శ్రీశైలం వెళ్లే భక్తులకు అలర్ట్.. మార్చి 1వ తేదీ నుంచి..

ABN , Publish Date - Feb 25 , 2024 | 09:18 AM

Srisailam Brahmotsavam: మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలం(Srisailam) వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకోసం బిగ్ అలర్ట్ న్యూస్. శ్రీశైలంలో మార్చి 1వ తేదీ నుంచి 11వ తేదీ వరకు మహాశివరాత్రి(Maha Shivratri) బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు ఆలయ అధికారులు. ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా మార్చి 1వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఆలయంలోని అన్ని ఆర్జిత సేవలను, స్పర్శ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ఆలయ అధికారులు(Srisailam Temple EO) ప్రకటించారు.

Srisailam News: శ్రీశైలం వెళ్లే భక్తులకు అలర్ట్.. మార్చి 1వ తేదీ నుంచి..
Maha Shivaratri Brahmotsavam

కర్నూల్, ఫిబ్రవరి 25: మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలం(Srisailam) వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకోసం బిగ్ అలర్ట్ న్యూస్. శ్రీశైలంలో మార్చి 1వ తేదీ నుంచి 11వ తేదీ వరకు మహాశివరాత్రి(Maha Shivratri) బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు ఆలయ అధికారులు. ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా మార్చి 1వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఆలయంలోని అన్ని ఆర్జిత సేవలను, స్పర్శ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ఆలయ అధికారులు(Srisailam Temple EO) ప్రకటించారు. బ్రహ్మోత్సవాల సమయంలో భక్తుల రద్దీ కారణంగా భక్తులందరికీ స్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతి ఉంటుందని ఆలయం ఈవో పెద్దిరాజు స్పష్టం చేశారు.

శివ స్వాములకు ప్రత్యేక దర్శనం..

జ్యోతిర్ముడి కలిగిన శివ స్వాములకు మాత్రమే 1వ తేదీ నుంచి 5వ తేదీ సాయంత్రం వరకు నిర్దిష్ట వేళల్లో ఉచిత స్పర్శ దర్శనానికి అవకాశం ఉంటుందని ఈవో తెలిపారు. 5వ తేదీన సాయంత్రం 7:30 నుండి 11 గంటల వరకు వరకు భక్తులందరికి శ్రీస్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతి ఉంటుంది. బ్రహ్మోత్సవాలలో భక్తులకు ఉచిత దర్శనంతోపాటు శీఘ్ర, అతి శీఘ్రదర్శనానికి ఆన్‌లైన్, కరెంట్ బుకింగ్‌కి ఏర్పాట్లు చేశామని ఈవో పెద్దిరాజు తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ABN ఛానల్ ఫాలో అవ్వండి

Updated Date - Feb 25 , 2024 | 09:39 AM