Share News

NRI: ఖతర్‌లో ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ వేడుకలు

ABN , Publish Date - Nov 19 , 2024 | 10:16 PM

ఆంధ్రప్రదేశ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఖతర్‌లో ఏపీ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి

NRI: ఖతర్‌లో ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ వేడుకలు

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: సహజ వాయువు సంపన్న ఖతర్ దేశంలోని ప్రవాసాంధ్రులు ఇటీవల ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించకొన్నారు. ఆంధ్రప్రదేశ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన భారతీయ రాయబారి విపుల్.. జ్యోతి ప్రజల్వన చేసి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా రాయబారి మాట్లాడుతూ నవ్యాంధ్రప్రదేశ్ పురోగమన దిశగా కదులుతున్న తీరు అభినందనీయమని అన్నారు. ఖతర్, భారత ద్వైపాక్షిక సంబంధాల పెంపుదలలో ప్రవాసీయుల పక్షాన ఆంధ్రప్రదేశ్ ప్రవాసీయుల పాత్ర చెప్పుకోదగ్గదని కొనియాడారు (NRI).

తఈ కార్యక్రమానికి కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ముఖ్య అతిథిగా పాల్గొనవల్సి ఉన్నా అనివార్య కారణాల వలన ఆయన రాలేకపోయినట్లుగా నిర్వాహకులు తెలిపారు.

NRI: నవంబర్ 23న తెలుగు కళా సమితి ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు3.jpg


గౌరవ అతిథిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ నూకసాని బాలాజీ మాట్లాడుతూ అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మార్పణం అనంతరం అమలయిన భాషా ప్రతిపాదిక రాష్ట్రాల గురించి వివరించారు.

ఈ సందర్భంగా ప్రవాసాంధ్ర చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు అందర్నీ ఆకట్టుకున్నాయి. వర్ధమాన గాయని అదితి భావరాజు, శిరీష, రఘురాంలు తమ మధుర పాటలతో ప్రేక్షకులను అలరించారు.

4.jpgNRI: నవంబర్ 23న తెలుగు కళా సమితి ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు


ఆంధ్రప్రదేశ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఒక సామాజిక సేవా సంఘమైనా ప్రవాసంలోని భావి తరాలకు ఆంధ్రప్రదేశ్ చరిత్ర తెలియజేసే ఉద్దెశ్యంతో రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నట్లుగా సంఘ ప్రతినిధులు పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు నరసింహాం జోశ్యుల ప్రారంభోపన్యాసం ఇస్తూ సంఘ ప్రగతి, కార్యకలాపాలను వివరించగా ఉపాధ్యక్షులు ఉమ మలిరెడ్డి కార్యక్రమ నిర్వహణ ఏర్పాట్లను చూడగా ప్రధాన కార్యదర్శి వర్జిల్ బాబు వందన సమర్పణ చేశారు.

2.jpgRead latest and NRI News

Updated Date - Nov 19 , 2024 | 10:16 PM