Dubai: దుబాయి తెలుగు సంఘంపై దుష్ప్రచారం జరుగుతోంది: సంస్థ ప్రతినిధులు
ABN , Publish Date - Sep 12 , 2024 | 06:19 PM
దుబాయిలోని తెలుగు ప్రవాసీ సంఘమైన తెలుగు అసోసియేషన్ కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతున్నాయని, చట్టబద్ధ కార్యవర్గం కూడా సాఫీగా తన కార్యకలాపాలు కొనసాగిస్తోందని సంఘం ప్రతినిధులు కొందరు తెలిపారు.
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: దుబాయిలోని తెలుగు ప్రవాసీ సంఘమైన తెలుగు అసోసియేషన్ కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతున్నాయని, చట్టబద్ధ కార్యవర్గం కూడా సాఫీగా తన కార్యకలాపాలు కొనసాగిస్తోందని సంఘం ప్రతినిధులు కొందరు తెలిపారు (NRI).
కొందరు దురుద్దెశంతో తమ సంఘంపై దుష్ప్రచారం కొనసాగిస్తున్నారని పేర్కొంటూ వారు ఇటీవల తమ సంఘం కార్యకలాపాలు, కార్యవర్గంపై వచ్చిన వార్తలను ఖండించారు. తెలుగు సంఘం అభివృద్ధిని జీర్ణించుకోలేని కొన్ని దుష్టశక్తులు మీడియాకు తప్పుడు సమాచారం అందించి తెలుగు సంఘాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నారని కూడా అరోపించారు.
NRI: ప్రవాసీ బీమా పథకాన్ని సహజ మరణాలకు వర్తించాలి: ఎన్నారై బీజేపీ నాయకుల డిమాండ్
సమాజానికి తిరిగి ఇవ్వాల్సిన నైతిక బాధ్యతగా యు.ఎ.ఇలోని తెలుగు సమాజ విశాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని వృత్తి, వ్యాపారాలలో స్థిరపడ్డ కొందరు ప్రముఖుల చొరవతో ప్రభుత్వ నియమాలకు అనుగూణంగా ఆమోదం పొందిన తమ సంఘం గత రెండేళ్ళలో అనేక సాంస్కృతిక, సామాజిక కార్యకలాపాలను చేపట్టిందని వివరించారు. ఇటీవల కాలంలో సామాజిక సంస్థల కార్యకలాపాలకు సంబంధించిన స్థానిక ప్రభుత్వం సవరించిన నియమాల కారణంగా తెలుగు సంఘం నూతన నిబంధనలను పాటించే వీలుగా తమ కార్యకలాపాలను నిలిపివేయాల్సి వచ్చిందని ప్రతినిధులు వెల్లడించారు.
Bahrain: తెలుగు కళా సమితిలో మార్మోగిన గణపతి బప్పా
అవసరమైన అనుమతులు పొందిన అనంతరం తెలుగు వారి సేవలో తెలుగు సంఘం మళ్ళీ పునరంకింతం కానుందని కూడా సంఘం ప్రతినిధులు పేర్కొన్నారు. తమ తదుపరి ప్రకటన వరకూ సంఘంపై జరుగుతున్న వదంతులు, తప్పుడు సమాచారాన్ని పట్టించుకోవద్దని విజ్ఞప్తి చేసారు.
NRI: తానా కాన్ఫరెన్స్- 2025 ప్రణాళిక కమిటీ నియామకం