Trending Video: రొమాంటిక్ సాంగ్.. రంగులతో హల్చల్.. దిల్లీ మెట్రోలో యువతుల రచ్చ..
ABN , Publish Date - Mar 23 , 2024 | 04:17 PM
దిల్లీ మెట్రో.. ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యం అందించే విషయాన్ని పక్కన పెడితే.. మెరుగైన ఎంటర్టైన్మెంట్ అందిస్తోందని మాత్రం నిర్మొహమాటంగా చెప్పవచ్చు. ప్రేమికుల ముచ్చట్లు, ముద్దూ మురిపాలు, వింత వింత పనులతో ఇప్పటికే దిల్లీ మెట్రో ఖ్యాతి మసకబారిపోయింది.
దిల్లీ మెట్రో.. ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యం అందించే విషయాన్ని పక్కన పెడితే.. మెరుగైన ఎంటర్టైన్మెంట్ అందిస్తోందని మాత్రం నిర్మొహమాటంగా చెప్పవచ్చు. ప్రేమికుల ముచ్చట్లు, ముద్దూ మురిపాలు, వింత వింత పనులతో ఇప్పటికే దిల్లీ మెట్రో ఖ్యాతి మసకబారిపోయింది. వీటిని అరికట్టేందుకు అధికారులు ఎన్ని చర్యలు చేపట్టినా మార్పు రావడం లేదు. హోలీ సమీపిస్తున్న తరుణంలో కొందరు రెచ్చిపోతున్నారు. చుట్టూ జనాలు ఉన్నారనే ఇంగితం కూడా లేకుండా రీల్స్ చేసుకుంటున్నారు. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. లైక్స్, కామెంట్స్ కోసం పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తున్నారు. తాజాగా దిల్లీ మెట్రో రైలులో అలాంటి ఘటనే చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ ( Viral ) గా మారింది.
వైరల్ అవుతున్న క్లిప్ లో ఇద్దరు యువతులు వైట్ కలర్ చుడీదార్ వేసుకున్నారు. చుట్టూ ప్రయాణికులు కూడా ఉన్నారు. కానీ వారు ఏ మాత్రం సంకోచించకుండా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకున్నారు. ఏకంగా రైలులోనే ముందస్తు హోలీ సంబురాలు చేసుకున్నారు. ఇంతటితో ఆగకుండా బాలీవుడ్ ఫేమస్ రొమాంటిక్ సాంగ్ అయిన అంగ్ లగాదేరే పాటకు స్టెప్పులు వేశారు. వీరి చేష్టలకు సాటి ప్రయాణికులు ఇబ్బందిగా ఫీల్ అయ్యారు. ఈ తతంగాన్నంతా ఓ ప్రయాణికుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియో అనతికాలంలోనే వైరల్ గా మారింది.
Kejriwal: అది మీకు అవసరం లేని విషయం.. జర్మనీ ప్రకటనపై భగ్గుమన్న భారత్..
ఈ వీడియోపై నెటిజన్లు తీవ్రంగా రియాక్ట్ అవుతున్నారు. పబ్లిసిటీ కోసం చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని దిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ కు విజ్ఞప్తి చేస్తున్నారు. జరిమానా విధించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరుతున్నారు. నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేయడంతో వీడియోపై దిల్లీ మెట్రో అధికారులు స్పందించారు. తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించే ఘటనలకు పాల్పడితే డీఎంఆర్సీ యాక్ట్ కింద నేరంగా పరిగణించాల్సి వస్తుందని తెలిపారు.
Punjab : నాడు డ్రగ్స్ మత్తు.. నేడు నకిలీ మందు చిచ్చు.. ఎన్నికల వేళ 20కి చేరిన మరణాలు..
మరిన్ని ప్రత్యేకం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.