Share News

Viral Video: అబ్బాయి, అమ్మాయి డ్యాన్స్ చేస్తుండగా అనుకోని ఘటన.. దుమ్మురేపుతున్న వీడియో

ABN , Publish Date - Aug 26 , 2024 | 01:21 PM

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక.. సరదాగా చేసినవి కూడా క్షణాల్లో వైరల్ అయిపోయి సంచలనానికి దారి తీస్తున్నాయి. సోషల్ మీడియా కారణంగా మంచి, చెడు రెండూ ఉన్నాయి. కొన్ని సార్లు ఫన్ కూడా ఓ రేంజ్‌లో ఉంటుంది.

Viral Video: అబ్బాయి, అమ్మాయి డ్యాన్స్ చేస్తుండగా అనుకోని ఘటన.. దుమ్మురేపుతున్న వీడియో

రాంచీ: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక.. సరదాగా చేసినవి కూడా క్షణాల్లో వైరల్ అయిపోయి సంచలనానికి దారి తీస్తున్నాయి. సోషల్ మీడియా కారణంగా మంచి, చెడు రెండూ ఉన్నాయి. కొన్ని సార్లు ఫన్ కూడా ఓ రేంజ్‌లో ఉంటుంది. సోషల్ మీడియా కారణంగా ప్రపంచం చాలా చిన్నదై పోయింది. ప్రపంచంలో ఏ మూలన ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో వైరల్ అవుతూ ఉంటుంది. ఇటీవల ఒక యూనివర్సిటీలో జరిగిన ఘటన నెట్టింట తెగ వైరల్ అవతోంది. చక్కగా అబ్బాయి, అమ్మాయి డ్యాన్స్ చేద్దామని వెళితే రాంగ్ సాంగ్ ప్లే అయ్యింది. ఇక అంతే వెంటనే అమ్మాయి చేతిని వదిలేసి అబ్బాయి మెరుపు వేగంతో దూరంగా వచ్చేశాడు. అది చూసిన స్టూడెంట్స్, ఫ్యాకల్టీ అంతా నవ్వుల్లో మునిగిపోయారు. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట దుమ్ము రేపుతోంది.


ఉత్తరాంచల్ యూనివర్శిటీలో ‘ఐస్ బ్రేకింగ్’ ఈవెంట్ జరుగుతోంది. దీనికి అధ్యాపకులతో పాటు విద్యార్థులంతా హాజరయ్యారు. యూనివర్సిటీ ఆడిటోరియంలో.. విద్యార్థులు కాలేజీ ఈవెంట్‌లో డ్యాన్స్ ప్రదర్శనలు ఇస్తున్నారు. చక్కగా హిందీ పాటలకు డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఆ సమయంలో ఓ ఘటన జరిగింది. దానికి సంబంధించిన వీడియోను సానియా రైత్వాన్ అనే స్టూడెంట్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఆ వీడియోకు దాదాపు 30 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. మరి ఆ స్థాయిలో వ్యూస్ వచ్చిన వీడియోలో ఏముందంటారా? వీడియోలో ఒక జూనియర్ అబ్బాయి.. తన సీనియర్ అయిన అమ్మాయితో డ్యాన్స్ చేస్తూ కనిపించాడు. ఇక అక్కడ ఉన్న స్టూడెంట్స్ అంతా క్లాప్స్ కొడుతూ.. ఈలలేస్తూ వారిని తెగ ఎంకరేజ్ చేస్తున్నారు.


మాంచి డ్యూయెట్ అనుకుని ఫీల్‌తో డ్యాన్స్ చేస్తున్నారు. సీన్ కట్ చేస్తే ప్లే అయిన పాట వచ్చేసి అన్నాచెల్లెళ్ల అనుబంధానికి సంబంధించినది. మరీ ముఖ్యంగా రక్షా బంధన్‌కి సంబంధించిన పాట. ఆ పాట ప్లే అవడంతో సదరు విద్యార్థి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. వెంటనే ఆ అమ్మాయి చెయ్యిని వదిలేసి దూరంగా వెళ్లిపోయాడు. అక్కడున్న విద్యార్థులు, అధ్యాపకులంతా నవ్వుల్లో మునిగిపోయారు. విద్యార్థులైతే క్లాప్స్ కొడుతూ అరుపులు, కేకలతో ఆడిటోరియంను హోరెత్తించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఫన్నీ ఫన్నీగా కామెంట్స్ పెడుతున్నారు.

Updated Date - Aug 26 , 2024 | 01:57 PM