Share News

LA Wild Fires: అమెరికాలో అడవులు తగలబడుతున్నా అదుపుతప్పని వాయు కాలుష్యం

ABN , Publish Date - Jan 11 , 2025 | 11:21 PM

లాస్ ఏంజిలిస్‌లో అడవులు తగలబడుతున్నా వాయు కాలుష్యం అదుపులోనే ఉండటానికి కారణం నగరం సముద్రానికి సమీపంలో ఉండటమేనని చెబుతున్నారు. సముద్రం మీదుగా వీచే గాలులకు గాల్లోని కాలుష్యం మరో చోటుకు కొట్టుకుపోతోందని నిపుణులు చెబుతున్నారు.

LA Wild Fires: అమెరికాలో అడవులు తగలబడుతున్నా అదుపుతప్పని వాయు కాలుష్యం

ఇంటర్నెట్ డెస్క్: లాస్ఏంజిలిస్‌లో కార్చిచ్చుకు నగరంలో సగ భాగం మంటల్లో చిక్కుకుంది. ఈ విపత్తుకు అనేక భవనాలు ఆహుతయ్యాయి. అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. నగరంలో ఇంత ప్రమాదం సంభవించినా వాయుకాలుష్యం మాత్రం అదుపులోనే ఉండటం అనేక మందిని ఆశ్చర్యపరుస్తోంది. ఢిల్లీలో పంట వ్యర్థాలను తగులబెట్టినందుకు వాయుకాలుష్యం ఇంతలా పెరిగిపోవడం ఏమిటని జనాలు షాకైపోతున్నారు. దీంతో, ఈ అంశం ప్రస్తుతం పెద్ద చర్చనీయాంశంగా మారింది (Viral).

Viral: లాస్ ఏంజిలిస్ కార్చిచ్చు.. లాటరీ సొమ్ముతో కొన్న ఇల్లు బుగ్గిపాలు!


దేశరాజధాని ఢిల్లీలో ఇటీవల ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఏకంగా 247కు చేరుకుంది. కానీ లాస్ ఏంజిలిస్‌లో ఇళ్లు తగలబడుతున్నా కూడా ఎయిర్ క్వాలిటీ కేవలం 60కే పరిమితమైంది. నిపుణులు చెప్పే దాని ప్రకారం, లాస్ ఏంజిలిస్ నగరం సముద్రానికి సమీపంలో ఉండటంతోనే ఇది సాధ్యమైందట. సముద్రం మీదుగా వీచే గాలుల్లో దుమ్మూధూళి కణాలన్నీ కొట్టుకుపోయాయని చెబుతున్నారు. చుట్టూరా మైదానాలు మినహా మరేవీ లేకి ఢిల్లీ నగర గగనతలంలో గాలుల వేగం తక్కువగా ఉండటంతో సూక్ష్మ ధూళి కణాలు ఎక్కడికక్కడ నిలిచిపోయి కాలుష్యం కాసారానికి దారి తీశాయని వివరిస్తున్నారు.

Viral: విమానంలో వైఫై సర్వీసు వెనక సాంకేతికత ఏంటో తెలుసా?


అయితే, జనవరి వచ్చినా ఢిల్లీ పరిస్థితిలో ఇంకా మార్పు రాలేదని కొందరు ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడి వాతావరణం దీపావళిని తలపిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, నగరంలో మళ్లీ కాలుష్య తీవ్రత పెరుగుతుండటంతో ప్రభుత్వం జీఆర్ఏపీ కార్యాచరణకు సంబంధించి మూడో దశ చర్యలను అమలు చేస్తోంది. దీని ప్రకారం, నగరంలో బీఎస్-3, బీఎస్-4 వాహనాలపై ఆంక్షలు పెరుగుతాయి.

Viral: భారతీయ రైల్వేకు అత్యధిక ఆదాయాన్ని సమకూర్చే రైలు ఏదో తెలుసా?

కాగా, ఢీల్లీ వాయు కాలుష్యం సమస్యను పరిష్కరించేందుకు అనేక చర్యలు చేపట్టాలని నిపుణులు చెబుతున్నారు. ప్రజారవాణా వ్యవస్థ, విద్యుత్ విహానాలను ప్రోత్సహించడం, పర్యావరణ హిత సాంకేతికతల వైపు మళ్లడం, సుస్థిర వ్యవసాయ విధాలను అనుసరించడం, శాస్త్రీయ పద్ధతిలో వ్యవసాయ వ్యర్థాల తొలగించడం వంటివి చేస్తే సమస్యను కొంత వరకూ పరిష్కరించవచ్చని చెబుతున్నారు.

Viral: ఉద్యోగులకు చాకిరీ ఎక్కువగా ఉన్న దేశాలు.. ఇక్కడి వారు రోజుకు ఎన్ని గంటలు పనిచేస్తారంటే..

Read Latest and Viral News

Updated Date - Jan 11 , 2025 | 11:49 PM