Share News

Viral Video: తెల్ల పులి ముందు కుప్పకూలిన బాలుడు.. ఆ తర్వాతేం జరిగిందో చూస్తే కళ్లు తేలేయడం ఖాయం!

ABN , Publish Date - Aug 11 , 2024 | 04:23 PM

సాధారణంగా వన్య ప్రాణులు చాలా క్రూరంగా ఉంటాయి. తమ జాతి జంతువులతో తప్ప వేరే జీవులతో కలిసి ఉండలేవు. ఇక, మనుషులను చూస్తే మరింతగా రెచ్చిపోతాయి. అయితే ఇటీవలి కాలంలో చాలా మంది వన్య ప్రాణులనే పెంపుడు జంతువులుగా మార్చేసుకుంటున్నారు.

Viral Video: తెల్ల పులి ముందు కుప్పకూలిన బాలుడు.. ఆ తర్వాతేం జరిగిందో చూస్తే కళ్లు తేలేయడం ఖాయం!
White Tiger

సాధారణంగా వన్య ప్రాణులు (Wild Animals) చాలా క్రూరంగా ఉంటాయి. తమ జాతి జంతువులతో తప్ప వేరే జీవులతో కలిసి ఉండలేవు. ఇక, మనుషులను చూస్తే మరింతగా రెచ్చిపోతాయి. అయితే ఇటీవలి కాలంలో చాలా మంది వన్య ప్రాణులనే పెంపుడు జంతువులుగా మార్చేసుకుంటున్నారు. దుబాయ్ (Dubai) వంటి దేశాలలో పులి (Tiger), సింహం (Lion) వంటి జంతువులను పెంచుకోవడం స్టేటస్ సింబల్‌‌గా మారిపోయింది. ఆయా జంతువులు కూడా తమ యజమానులతో స్నేహపూర్వకంగా మెలుగుతూ ఆశ్చర్యపరస్తున్నాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తే షాకవ్వాల్సిందే (Viral Video).


alshadahmad అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ బోనులో తెల్ల పులి (White Tiger) ఉంది. దాని ముందుకు వెళ్లిన ఓ బాలుడు గుండె పోటు వచ్చినట్టు నటించి కింద పడిపోయాడు. ఆ పులి వెంటనే ముందుకు వచ్చి ఆ బాలుడిని లేపే ప్రయత్నం చేసింది. అతడి చేతిని నోట్లో పెట్టుకుని పల్స్ చెక్ చేసింది. ఆ బాలుడికి ఏదో జరిగిపోయిందని కంగారుపడుతుంది. చుట్టూ ఎవరైనా ఉన్నారేమో అని చూసింది. ఎవరినో పిలవడానికి అన్నట్టు పరిగెత్తుకుంటూ వెళ్లిపోయింది.


ఈ వీడియోలో పులి ప్రవర్తన చాలా మందికి షాక్ కలిగించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఇప్పటివరకు 1.25 కోట్ల మందికి పైగా వీక్షించారు. దాదాపు 4.8 లక్షల మంది లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``పులిలో కూడా మానవత్వం దాగుందన్నమాట``, ``అది యాక్టింగ్ అని పులికి కూడా తెలుసు``, ``ఆ బాలుడి కంటే పులి గొప్పగా యాక్ట్ చేసింది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral News: ట్యాలెంట్ కాదు.. జాతకమే ముఖ్యం.. ఆ రాశిలో పుట్టిన వారు అప్లై చేయొద్దంటూ చైనా కంపెనీ వినూత్న ప్రకటన!


Viral Video: రస్క్ తింటే రిస్క్‌ ఖాయం.. టీతో పాటు మీరూ రస్క్‌లు తింటారా? ఈ వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..!


Optical Illusion: ఈ ఫొటోలో ఎన్ని ఆవులున్నాయో కనిపెట్టండి.. 10 సెకెన్లలో కనిపెడితే మీరు గ్రేట్..!


Viral Video: నమ్మశక్యం కాని వీడియో.. భారీ పర్వతాలపై చిరుతలు ఎలా గెంతుతున్నాయో చూడండి..!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి.

Updated Date - Aug 11 , 2024 | 04:23 PM