Viral Video: పెళ్లి తర్వాత అత్తారింటికి వెళ్లనని వధువు మారాం.. ఆమె సోదరుడు ఏం చేశాడో చూస్తే నవ్వాపుకోలేం..
ABN , Publish Date - Oct 22 , 2024 | 02:13 PM
మన దేశంలోని ఆడ పిల్లలకు పెళ్లితో చాలా మార్పులు వస్తాయి. ఇంటి పేరు మారడమే కాదు.. అప్పటి వరకు తిరిగిన పుట్టింటిని వదలి వెళ్లిపోవాలి. ఆ సమయంలో భావోద్వేగాలు, కన్నీళ్లు సహజం. కానీ కొంత సేపటికి సర్దుకుని అత్తింటికి బయలుదేరక తప్పదు.
వివాహం (Marriae) అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ముఖ్యమైన మార్పులకు కారణమవుతుంది. ముఖ్యంగా మన దేశంలోని ఆడ పిల్లలకు అయితే పెళ్లితో చాలా మార్పులు వస్తాయి. ఇంటి పేరు మారడమే కాదు.. అప్పటి వరకు తిరిగిన పుట్టింటిని వదలి వెళ్లిపోవాలి. ఆ సమయంలో భావోద్వేగాలు, కన్నీళ్లు సహజం. కానీ కొంత సేపటికి సర్దుకుని అత్తింటికి బయలుదేరక తప్పదు. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తే ఆశ్చర్యపోక తప్పదు. ఆ తర్వాత పొట్ట చెక్కలయ్యేలా నవ్వకా తప్పదు (Viral Video).
@24karattgold1 అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో వివాహం తర్వాత అత్తింటికి వెళ్లేందుకు వధువు (Bride) ఇష్టపడడం లేదు. సాధారణంగా ఆ సమయంలో వధువు, ఆమె కుటుంబ సభ్యులు కన్నీళ్లు పెట్టుకోవడం సహజం. అయితే ఆ వీడియోలోని వధువు అత్తింటికి (In-law`s house) వెళ్లనని మొండికేసింది. పెద్దగా కేకలు పెడుతూ ఏడుపు ప్రారంభించింది. దీంతో సోదరుడు ఆమెను ఎత్తుకుని బలవంతంగా కారులో కూర్చోబెట్టారు. ఆ సమయంలో కూడా ఆ వధువు పెద్దగా ఏడుస్తూనే ఉంది. గ్రామస్తులందరూ ఆమెను చూసి ఆశ్చర్యపోయారు. చాలా మంది ఆ ఘటన చూసి నవ్వుకున్నారు.
ఆ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దాదాపు 3 లక్షల మంది ఈ వీడియోను వీక్షించారు. చాలా మంది ఈ వీడియోపై ఫన్నీ కామెంట్లు చేశారు. ``ఆమెను కిడ్నాప్ చేస్తున్నారా? అత్తింటికి తీసుకెళ్తున్నారా``, ``స్కూల్‌కు వెళ్లే పిల్లలా ఉంది``, ``వెరీ ఫన్నీ``, ``ఆమెను ఎందుకు బలవంతం చేస్తున్నారు``, ``ఈ మాత్రం దానికి పెళ్లి ఎందుకు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Viral: ఈ ఆటో డ్రైవర్ తెలివికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.. ప్యాసింజర్లకు కన్నడం ఎలా నేర్పుతున్నాడంటే..
Picture Puzzle: మీ ఐక్యూ లెవెల్‌కు టెస్ట్.. ఈ ఫొటోలో ఎన్ని పుచ్చకాయలు ఉన్నాయో చెప్పండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..