Share News

Viral: ప్రపంచంలోని ఒకే ఒక 10 స్టార్ హోటల్! రూమ్ రెంట్ ఒక్క రాత్రికి రూ.10 లక్షలు!

ABN , Publish Date - Dec 30 , 2024 | 04:16 PM

ప్రపంచంలో ఉన్న ఒకే ఒక 10 స్టార్ హోటల్ బుర్జ్ అల్ అరబ్. దుబాయ్‌లో ఉన్న ఈ హోటల్‌ ప్రత్యేకతలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

Viral: ప్రపంచంలోని ఒకే ఒక 10 స్టార్ హోటల్! రూమ్ రెంట్ ఒక్క రాత్రికి రూ.10 లక్షలు!

ఇంటర్నెట్ డెస్క్: మనందరం ఫైర్ స్టార్ హోటళ్ల గురించి ఎప్పుడోకప్పుడు చదివే ఉంటాం. ఈ హోటళ్ల గొప్పదనం గురించి మాటల్లో చెప్పడం కష్టం. భూలోకంలో స్వర్గం అన్న రేంజ్‌లో సౌకర్యాలు ఉంటాయి. కానీ దీన్ని తలదన్నే 10 స్టార్ హోటల్ కూడా ఉందని మీకు తెలుసా? ఇందులో ఉన్న ప్రత్యేకతలు మరెక్కడా ఉండవని జనాలు చెబుతుంటారు. మరి ఈ హోటల్ ఎక్కడుందో? దాని రేంజ్ ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం (Viral).

దూబాయ్ అంటేనే లగ్జరీకి పెట్టింది పేరు. ఇక్కడున్న బుర్జ్ అల్ అరబ్ హోటల్.. 10 స్టార్ రెటింగ్ కలిగిన ఒకే ఒక హోటల్‌గా పేరుగాంచింది. వాస్తవానికి 10 స్టార్ హోటల్ అనే అధికారిక గుర్తింపు ఏదీ లేకపోయినా ఈ హోటల్‌లోని సౌకర్యాల దృష్ట్యా దీనికి ఈ పేరు వచ్చింది.

Viral: ఎద్దును స్తంభానికి కట్టేసి కర్రతో చావబాదిన వ్యక్తి.. దారుణమైన వీడియో


1999లో ఓ కృత్రిమ ద్వీపంలో బుర్జ్ అల్ అరబ్‌ను ప్రారంభించారు. దీన్ని నిర్మాణానికి అప్పట్లోనే కోటి బిలియన్ డాలర్లు ఖర్చైందట. ఇందుకు తగ్గట్టుగానే ఇక్కడ రూమ్‌ల ధరలు ఉంటాయట. ఒక్కో గదిలో ఓ రాత్రి ఉండేందుకు ఏకంగా రూ.10 లక్షలు చెల్లించాలట. దీంతో, అపరకుబేరులు మాత్రమే ఇందులో విడిది చేస్తుంటారు. రోల్స్ రాయిస్ కార్లు, హెలికాఫ్టర్లలో హంగూఆర్భాటాలతో వచ్చి ఇక్కడ విడిది చేస్తుంటారు.

Viral: లీటరు నూనె ఫ్రీ ఇస్తామని చెప్పి మోసం.. బ్లింకిట్‌పై కస్టమర్ ఆరోపణ

ఇక ఈ హోటల్‌లో ఒక్క రోజు ఉన్నా జీవితం కాలం మర్చిపోలేని మధుర స్మృతులు పోగేసుకోవచ్చని కొందరు అంటారు. ఫ్లోరింగ్ నుంచి సీలింగ్ వరకూ చూపు తిప్పుకోలేని విధంగా హోటల్‌ను అలంకరించారట. అత్యాధునిక సదుపాయాలన్నీ ఇక్కడ ఉంటాయి. ఇక్కడి ఎనిమిది రెస్టారెంట్లలో ప్రజలకు తమకు నచ్చిన ఫుడ్‌ను ఎంజాయ్ చేయొచ్చు. లగ్జరీ స్పాల్లో రిలాక్స్ కావచ్చు..లేదా సౌనా, ఇండోర్ ఇన్ఫినిటీ పూల్‌లో ఈత కొడుతూ ఎంజాయ్ చేయొచ్చు.


ఇక్కడి స్కై వ్యూబార్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఏకంగా 656 ఎత్తులో ఉన్న ఈ బార్ నుంచి అరేబియా సముద్ర అందాలను వీక్షించొచ్చు. ఇక రూఫ్ టాప్ బార్ అనేది ఈ హోటల్‌కు ఉన్న మరో ప్రత్యేకత. ప్రకృతి రమణీయతను ఆస్వాదించాలనుకునే వారు పక్కనే ఉన్న జుమేరా వైల్డ్ వాడీ వాటర్ పార్క్‌‌కు కూడా వెళ్లొచ్చు.

ఇక హోటల్ స్టార్ స్టేటస్ నిర్ణయించేందుకు ఓ ప్రమాణిక పద్ధతి ఉందని నిపుణులు చెబుతున్నారు. కొన్ని మార్పుల మినహా దాదాపు అన్ని దేశాల్లో హోటల్ రేటింగ్‌ను నిర్ణయించేందుకు ఇదే పద్ధతిని ఫాలో అవుతారట. నిపుణులు చెప్పేదాని ప్రకారం, రూమ్‌ల సైజు, బాత్‌ రూంల సైజు, స్విమ్మింగ్ పూల్, వైఫై వంటి సదుపాయాలు ఎలా ఉన్నాయనే దాన్ని బట్టి రేటింగ్ నిర్ణయిస్తారు.

Read Latest and Viral News

Updated Date - Dec 30 , 2024 | 04:16 PM