Viral: ప్రతి విమానంలో ఇలాంటి ప్యాసెంజర్ ఉండాల్సిందే! నెట్టింట వైరల్‌గా మారిన వీడియో!
ABN , Publish Date - Jun 09 , 2024 | 10:04 PM
విమాన ప్రయాణాల్లో ఎప్పుడు ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందో చెప్పడం కష్టం. కానీ స్పిరిట్ ఎయిర్లైన్స్ ప్రయాణికులు ఓ గొప్ప సర్‌ప్రైజ్‌ను ఎంజాయ్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

ఇంటర్నెట్ డెస్క్: విమాన ప్రయాణాల్లో ఎప్పుడు ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందో చెప్పడం కష్టం. కానీ స్పిరిట్ ఎయిర్లైన్స్ ప్రయాణికులు ఓ గొప్ప సర్‌ప్రైజ్‌ను ఎంజాయ్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ (Viral) అవుతోంది.
స్పిరిట్ ఎయిర్ లైన్స్‌కు చెందిన ఓ విమానం మే 14న లాన్ ఏంజిలిస్ నుంచి నాష్‌విల్ బయలుదేరింది. అయితే, విమానంలో ఓ ప్యాసెంజర్ తన వెంట పెంపుడు పిల్లి కూడా తెచ్చుకున్నారు. అదేమో ఒక చోట ఉండకుండా విమానమంతా కలియతిరగడం ప్రారంభించింది. అప్పటిదాకా స్తబ్దుగా సాగుతున్న ప్రయాణం పిల్లి ఎంట్రీతో ఒక్కసారిగా మారిపోయింది. ముద్దొస్తున్న పిల్లిని చూసి ప్రయాణికులందరూ మురిసిపోయారు. ప్రతిఒక్కరూ దాన్ని నిమురుతూ ముద్దు చేశారు. అదేమో విమానమంతా తిరుగుతూ ఆహ్లాదవాతావరణాన్ని సృష్టించింది (Cat spotted roaming around in flight aisle delights passengers Video is viral).
Viral: ఎయిర్‌పోర్టులో ఎవరూ ఊహించని సౌకర్యం! పెదవి విరుస్తున్న ప్రయాణికులు!
ఇక వీడియోలో ఇదంతా చూసిన ప్రయాణికులు కూడా మురిసిపోతున్నారు. ఇలాంటి ప్యాసెంజర్లున్న విమానాల్లో ప్రయాణం ఆహ్లాదంగా ఉంటుందని కామెంట్ చేశారు. ఎన్నో విమానాల్లో ప్రయాణించా కానీ ఇలాంటి ఎంటర్‌టైన్మెంట్ మాత్రం ఎప్పుడూ చూడలేదని అన్నారు. ఇలా రకరకాల కామెంట్ల మధ్య వీడియో వైరల్‌గా మారింది.