Share News

Viral Video: సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కే షాక్.. పానీపూరీ అమ్మే వ్యక్తి సంపాదన ఎంతో విని కళ్లు తేలేసిన యువతి!

ABN , Publish Date - Jul 05 , 2024 | 09:49 AM

ప్రతిరోజూ ఖరీదైన బట్టలు వేసుకుని, బైక్‌లు, కార్లలో ఆఫీస్‌లకు వెళ్లే కార్పొరేట్ ఉద్యోగులు, సాఫ్ట్‌వేర్ ఎంప్లాయిస్‌ను చూసి చాలా మంది ఈర్ష్య పడుతుంటారు. వారి సంపాదన గురించి తెలుసుకుని షాకవుతుంటారు. అయితే అలాంటి కార్పొరేట్ ఉద్యోగులకే కూడా షాకిచ్చే కొందరు సామాన్యులు ఉంటారు.

Viral Video: సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కే షాక్.. పానీపూరీ అమ్మే వ్యక్తి సంపాదన ఎంతో విని కళ్లు తేలేసిన యువతి!
Golgappa vendor

ప్రతిరోజూ ఖరీదైన బట్టలు వేసుకుని, బైక్‌లు, కార్లలో ఆఫీస్‌లకు వెళ్లే కార్పొరేట్ ఉద్యోగులు, సాఫ్ట్‌వేర్ ఎంప్లాయిస్‌ను (Software Employees) చూసి చాలా మంది ఈర్ష్య పడుతుంటారు. వారి సంపాదన (Income) గురించి తెలుసుకుని షాకవుతుంటారు. అయితే అలాంటి కార్పొరేట్ ఉద్యోగులకే కూడా షాకిచ్చే కొందరు సామాన్యులు ఉంటారు. అలాంటి ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఓ ఉద్యోగిణి ఓ సాధారణ పానీపూరీ అమ్మే వ్యక్తితో (Golgappa vendor) మాట్లాడింది. అతడి సంపాదన ఎంతో తెలుసుకుని కళ్లు తేలేసింది (Viral Video).


sri.shti_07 అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ పానీపూరీ వాలాతో ఓ యువతి మాట్లాడుతోంది. ``భయ్యా.. నీ నెలవారీ సంపాదన ఎంత?`` అని అడిగింది. దానికి ఆ వ్యక్తి స్పందిస్తూ.. ``నెలకు రూ.70 వేల వరకు సంపాదిస్తా`` అని చెప్పాడు. దాంతో ఆ యువతి షాకైంది. నెలకు రూ.70 వేలు అంటే ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ జీతంతో దాదాపు సమానం అనే చెప్పాలి. పైగా ఎలాంటి ట్యాక్సులూ కట్టనసవరం లేకుండా సంపాదన మొత్తం జేబులోకి చేరుతుంది. ఈ వీడియో చూసిన చాలా మంది చిరుద్యోగులు షాకవుతున్నారు.


ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు 2.4 కోట్ల మంది వీక్షించారు. 11 లక్షల కంటే ఎక్కువ మంది ఈ వీడియోను వీక్షించారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``మీ స్టాల్ దగ్గర ప్లేట్‌లు కడిగే ఉద్యోగం ఉంటే నాకు కావాలి``, ``ఈ కుర్రాడు మొత్తం విద్యా వ్యవస్థను సవాలు చేస్తున్నాడు``, ``కార్పొరేట్ ఉద్యోగులు పక్కకు వెళ్లి ఏడుస్తున్నారు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Puzzle: ఈ ఫొటోలోని అమ్మాయిలో ఏదో తేడా ఉంది.. 8 సెకెన్లలో కనిపెడితే మీ పరిశీలనా శక్తి గొప్పదే!


Viral Video: ఈ వధూవరుల డ్యాన్స్ చూస్తే ముచ్చటేయడం ఖాయం.. సిగ్గుపడుతూనే ఎలా చిందులేశారో చూడండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jul 05 , 2024 | 09:49 AM