Swiggy: మహిళ స్విగ్గీ అకౌంట్ హ్యాకింగ్.. నిందితులు ఎలాంటి షాకిచ్చారంటే..
ABN , Publish Date - Feb 22 , 2024 | 05:12 PM
మహిళ స్విగ్గీ అకౌంట్ హ్యాక్ చేసిన ఇద్దరు నిందితులు ఆమె అకౌంట్ ద్వారా ఏకంగా రూ.97 వేల విలువ గల వస్తువులను ఆర్డరిచ్చాడు. తన అకౌంట్లో అకస్మాత్తుగా డబ్బు మాయమవడం గుర్తించిన బాధితురాలు చివరకు పోలీసులను ఆశ్రయించారు.
ఇంటర్నెట్ డెస్క్: ఓ మహిళ స్విగ్గీ అకౌంట్ హ్యాక్ (Hacking) చేసిన ఇద్దరు నిందితులు ఆమె అకౌంట్ ద్వారా ఏకంగా రూ.97 వేల విలువ గల వస్తువులను ఆర్డరిచ్చారు. తన అకౌంట్లో అకస్మాత్తుగా డబ్బు మాయమవడం గుర్తించిన బాధితురాలు చివరకు పోలీసులను ఆశ్రయించారు. గురుగ్రామ్‌లో ఈ ఘటన వెలుగు చూసింది. ఈ కేసులో నిందితులైన అంకిత్ కల్రా, హిమాన్షూ కుమార్‌ను పోలీసులు తాజాగా అరెస్టు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, అంకిత్ కల్రా గతంలో జొమాటో, స్విగ్గీ రెండింట్లో డెలివరీ బాయ్‌గా పనిచేశాడు. అతడు కుమార్‌తో కలిసి ఐవీఆర్ఎస్ ద్వారా మహిళ స్విగ్గీ అకౌంట్‌ను హ్యాక్ చేశారు. ఆ తరువాత ఆమె అకౌంట్లోంచి పలు పచారీ సామాన్లు ఆర్డరిచ్చారు. వాటిని తక్కువ ధరకు మార్కెట్లో అమ్ముకుని సొమ్ము చేసుకున్నారు. తన అకౌంట్లో డబ్బు తుడిచిపెట్టుకుపోవడం గుర్తించిన ఆమె పోలీసులను ఆశ్రయించారు (Hackers Raid Woman's Swiggy Account, Place Orders Close To Rs 1 Lakh).
కాగా, ఘటనపై స్విగ్గీ కూడా స్పందించింది. హ్యాకింగ్ గురైన అకౌంట్లను డీలింక్ చేసేందుకు తగు చర్యలు చేపట్టినట్టు వెల్లడించింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరక్కుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించింది.