Share News

IQ Test: మీ ఐక్యూ లెవల్స్ కు ఇదే ఛాలెంజ్.. ఈ ఫొటోలో న్యూస్ పేపర్ ఎక్కడుందో 5 సెకెన్లలో కనిపెట్టండి..

ABN , Publish Date - Nov 02 , 2024 | 12:01 PM

ఈ ఫొటోలో న్యూస్ పేపర్ ఎక్కడుందో 5 సెకెన్లలో కనుక్కుంటే మీ ఐక్యూ లెవల్ పీక్స్ లో ఉన్నట్టే..

IQ Test: మీ ఐక్యూ లెవల్స్ కు ఇదే ఛాలెంజ్.. ఈ ఫొటోలో న్యూస్ పేపర్ ఎక్కడుందో 5 సెకెన్లలో కనిపెట్టండి..
IQ Test

మెదడు ఎంత వేగంగా పనిచేస్తుందో.. ఎంత లాజిక్ గా ఆలోచిస్తుందో.. ఒక సమస్యకు పరిష్కాన్ని ఎంత తొందరగా కనిపెడుతుందనే విషయాల ఆధారంగా ఐక్యూ ను అంచనా వేస్తారు. ఐక్యూ ఎక్కువ ఉన్నవారిని ప్రతిభావంతులని అంటారు. మీరు ప్రతిభావంతులైతే మీ ఐక్యూ స్థాయిని నిరూపించుకునే సమయం వచ్చింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక ఫొటో దీనికి వేదికగా మారింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక ఫొటోలో ఒక న్యూస్ పేపర్ దాగుంది.. దాన్ని 5 సెకెన్లలో కనిపెడితే మీరు మేధావులని ఒప్పుకోవాల్సిందే.. దీని గురించి ఫూర్తీగా తెలుసుకుంటే..

జీలకర్రను ఇలా వాడితే శరీరంలో కొవ్వు కరిగిపోద్ది..


అప్టికల్ ఇల్యూషన్, మెదడుకు మేత, పద వినోదం, సుడోకు, పజిల్స్ పూర్తీ చేయడం, తేడాలు కనుక్కోవడం వంటివి మెదడుకు చాలా పని పెడతాయి. మెదడుతో పాటు కంటిచూపును కూడా ఇవి ఛాలెంజ్ చేస్తాయి. వీటన్నింటిలో చురుగ్గా ఉండి వీటిని తొందరగా పరిష్కరించగలిగితే ఐక్యూ లెవల్స్ పీక్స్ లో ఉన్నట్టే.. ఇక ఇప్పుడు వైరల్ అవుతున్న ఫొటో ఒక పార్క్ కు సంబంధించినది. పార్క్ లో పచ్చని తివాచీలలో ఏర్పాటు చేసిన బెంచ్ ల మీద కొందరు కూర్చొన్నారు. మరికొందరు అటు ఇటు నడుస్తున్నారు. ఈ ఫొటోలో న్యూస్ పేపర్ ను 5 సెకెన్లలో కనిపెట్టాలి. కానీ అధిక శాతం మంది 5 సెకెన్లలో న్యూస్ పేపర్ ను కనిపెట్టడంలో విఫలమవుతున్నారు.

opticalillusion1.jpg

Health Tips: దీపావళి తరువాత చాలా మంది ఎదుర్కునే సమస్యలు.. వాటికి పరిష్కారాలు ఇవిగో..


ఫొటోను జాగ్రత్తగా గమనిస్తే.. పార్క్ లో బల్ల మీద కూర్చొన్న ఇద్దరు వ్యక్తులు ఏదో మాట్లాడుకుంటున్నారు. ఇందులో ఒకరు మహిళ కాగా మరొకరు పురుషుడు. వీరిద్దరి మధ్య న్యూస్ పేపర్ ఉండటం గమనించవచ్చు. 5 సెకెన్లలో ఈ న్యూస్ పేపర్ ను కనిపెట్టిన వారి ఆలోచనా తీరు, మెదడు పనితీరు చాలా వేగంగా ఉన్నాయని, వారి ఐక్యూ లెవల్ కూడా ఎక్కువ ఉంటాయని అంటున్నారు.

ఇవి కూడా చదవండి..

ఈ లక్షణాలు కనిపిస్తే.. బోలు ఎముకల వ్యాధి మొదలైనట్టే..

బార్లీ నీటి గురించి మీకు తెలియని షాకింగ్ నిజాలివి..

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ప్రత్యేక వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Nov 02 , 2024 | 12:01 PM