Share News

Laptop: మీ ల్యాప్ టాప్ చాలా స్లోగా పనిచేస్తోందా.. ఈ టిప్స్‌ పాటిస్తే కొత్తదానిలా పరుగులే!

ABN , Publish Date - Jun 18 , 2024 | 04:59 PM

ల్యాప్టాప్ ఒకప్పుడు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేవారి దగ్గర మాత్రమే ఉండేది. వీరికి ల్యాప్టాప్ స్లోగా పనిచేస్తుంటే దాన్ని తిరిగి ఫాస్ట్ గా పనిచేసేలా చేయడం తెలిసి ఉంటుంది. కానీ ఇప్పుడు చదువుకునే పిల్లలకు కూడా ఇది అత్యవసర వస్తువు అయిపోయింది. అయితే ల్యాప్టాప్ ను వాడటం వచ్చినట్టు దీన్ని తిరిగి స్పీడ్ గా పనిచేసేలా చేయడం వీరికి చేతకాదు. కొందరు ల్యాప్టాప్ చాలా స్లోగా పనిచేస్తోందని ఫిర్యాదు చేస్తుంటారు.

Laptop: మీ ల్యాప్ టాప్ చాలా స్లోగా పనిచేస్తోందా.. ఈ టిప్స్‌ పాటిస్తే కొత్తదానిలా పరుగులే!

ల్యాప్టాప్ ఒకప్పుడు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేవారి దగ్గర మాత్రమే ఉండేది. వీరికి ల్యాప్టాప్ స్లోగా పనిచేస్తుంటే దాన్ని తిరిగి ఫాస్ట్ గా పనిచేసేలా చేయడం తెలిసి ఉంటుంది. కానీ ఇప్పుడు చదువుకునే పిల్లలకు కూడా ఇది అత్యవసర వస్తువు అయిపోయింది. అయితే ల్యాప్టాప్ ను వాడటం వచ్చినట్టు దీన్ని తిరిగి స్పీడ్ గా పనిచేసేలా చేయడం వీరికి చేతకాదు. కొందరు ల్యాప్టాప్ చాలా స్లోగా పనిచేస్తోందని ఫిర్యాదు చేస్తుంటారు. నిజానికి ల్యాప్టాప్ లు బ్రౌజర్ కాష్ కారణంగా పనితీరులో నెమ్మదిస్తాయి. మెమరీ కలిగి ఉన్న ఏ గ్యాడ్జెట్ అయినా ఉపయోగించే కొద్దీ ఆ గ్యాడ్జెట్ లో కాష్ మెమరీ ఏర్పడుతుంది. యాప్స్, బ్రౌజర్లు ఉపయోగించిన తరువాత ఈ కాష్ మెమరీ పేరుకుపోవడం వల్ల ఆ గ్యాడ్జెట్ పనితీరు నెమ్మదిస్తుంది. బ్రౌజర్ కాష్ ను క్లియర్ చేయడం ద్వారా ల్యాప్టాప్ సూపర్ ఫాస్ట్ గా పనిచేస్తుంది. దీన్ని ఎలా క్లియర్ చేయాలో తెలుసుకుంటే..

ఈ లక్షణాలున్న అబ్బాయిలంటే అమ్మాయిలకు చాలా ఇష్టమట..!


గూగుల్ క్రోమ్..(Google Chrome)

క్రోమ్ ను ఓపెన్ చెయ్యాలి.

పైన కుడి మూలలో ఉన్న మూడు చుక్కల మీద టచ్ చెయ్యాలి.

అక్కడ 'క్లియర్ బ్రౌజింగ్ డేటా' అని ఉంటుంది. అక్కడ లేకపోతే 'మోర్ టూల్స్' అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసినా 'క్లియర్ బ్రౌజింగ్ డేటా' అని చూపిస్తుంది. 'క్లియర్ బ్రౌజింగ్ డేటా'ను ఎంచుకోవాలి. అక్కడ 'టైమింగ్' చూపిస్తుంది. 'ఆల్ టైమ్' ను ఎంచుకోవాలి.

కాష్ చేయబడిన ఫొటోస్, ఫైల్స్ ఎంచుకోవాలి. తరువాత 'క్లియర్ డేటా' మీద క్లిక్ చేయాలి.

ఇలా చేస్తే క్రోమ్ బ్రౌజర్ కాష్ మెమరీ క్లియర్ అవుతుంది. దీంతో ల్యాప్టాప్ లో చాలావరకు స్పేస్ ఫ్రీ అవుతుంది.

పిల్లలలో ఏకాగ్రత పెరగాలంటే ఈ యోగా ఆసనాలు ట్రై చేయండి..!


మొజిల్లా ఫైర్ ఫాక్స్..(Mozilla FireFox)

ఫైర్ ఫాక్స్ ను ఓపెన్ చేయాలి.

పైన కుడివైపున మూడు చిన్న గీతలు ఉంటాయి. ఆ గీతల మీద క్లిక్ చేసి 'ఆప్షన్స్' ఎంచుకోవాలి.

ఆప్షన్స్ వచ్చాక 'ప్రైవసీ& ప్రొటెక్షన్' ప్యానెల్ లోకి వెళ్లాలి.

'ప్రైవసీ&ప్రొటెక్షన్ ప్యానెల్' లో 'కుకీలు అండ్ సైట్ డేటా' విభాగంలో 'క్లియర్ డేటా బటన్' ను క్లిక్ చేయాలి.

'క్లియర్ డేటా బటన్' ఎంచుకున్నాక 'కాష్ వెబ్ కంటెంట్' చెక్ చేసి 'క్లియర్ బటన్' ను క్లిక్ చేయాలి.

ఇలా చేస్తే ఫైర్ ఫాక్స్ లో ఉన్న కాష్ మెమరీ క్లియర్ అవుతుంది. దీనివల్ల ల్యాప్టాప్ లో స్పేస్ ఫ్రీ అవుతుంది. ల్యాప్టాప్ ఫాస్ట్ గా పనిచేస్తుంది.

మహిళలలో ఐరన్ లోపం ఉంటే కనిపించే లక్షణాలు ఇవే..!


మైక్రో సాఫ్ట్ ఎడ్జ్..(Microsoft Edge)

మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ ఓపెన్ చేయాలి.

పైన కుడివైపున ఉండే మూడు చుక్కలను క్లిక్ చేసి 'సెట్టింగ్స్' ను సెలెక్ట్ చేసుకోవాలి.

సెట్టింగ్స్ లో 'ప్రైవసీ, సెర్చింగ్ అండ్ సర్వీస్' పై క్లిక్ చేయాలి.

అక్కడ 'క్లియర్ బ్రౌజింగ్ డేటా' సెషన్ లో ఏది క్లియర్ చేయాలో ఎంచుకోవాలి.

'టైమింగ్' దగ్గర 'ఆల్ టైమ్' ఎంచుకోవాలి.

'కాష్ ఫొటోస్, ఫైల్స్' ను సెలెక్ట్ చేసి 'క్లియర్ నౌ' అనే బటన్ పై క్లిక్ చేయాలి.

మైక్రో సాఫ్ట్ ఎడ్జ్ లో కాష్ మెమరీ క్లియర్ చేయడం వల్ల ల్యాప్టాప్ లో స్పేస్ ఫ్రీ అవుతుంది. ల్యాప్టాప్ స్పీడ్ గా పనిచేస్తుంది.

పిల్లలలో ఏకాగ్రత పెరగాలంటే ఈ యోగా ఆసనాలు ట్రై చేయండి..!


విండోస్ సిస్టమ్..(Windows System)

స్టార్ట్(Start) మెనుని తెరచి డిస్క్ క్లీనప్(Disk cleanup) కోసం సెర్చ్ చేయాలి.

డ్రైవ్(Drive) ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత ఓకే(ok) ను క్లిక్ చేయాలి.

'రిమూవ్' ఫైల్స్ లిస్ట్ లో 'టెంపరరీ' ఫైల్స్ తో పాటు ఇతర 'కాష్ ఫైల్స్' ను సెలెక్ట్ చేసుకోవాలి.

ఇలా సెలెక్ట్ చేసుకున్న తరువాత 'ఓకే' క్లిక్ చేసి, 'రిమూవ్ ఫైల్స్' బటన్ ను క్లిక్ చేయాలి.

విండోస్ సిస్టమ్ లో ఉన్న కాష్ ఫైల్స్ క్లియర్ అవుతాయి. ల్యాప్టాప్ స్పీడ్ గా పనిచేస్తుంది.

మహిళలలో ఐరన్ లోపం ఉంటే కనిపించే లక్షణాలు ఇవే..!


రన్ కమాండ్..(Run Command)

రన్ డైలాగ్ బాక్స్ ఓపెన్ చేయడానికి విండోస్ +R(Windows+R) బటన్ ను క్లిక్ చేయాలి.

temp అని టైప్ చేసి ఎంటర్ కొట్టాలి.

అన్ని ఫైల్స్ సెలెక్ట్ చేసుకుని రిమూవ్ చేయాలి.

మళ్లీ రన్ ఓపెన్ చేసి ఈసారి %temp% అని టైప్ చేసి ఎంటర్ కొట్టాలి.

అన్ని ఫైల్స్ సెలెక్ట్ చేసి రిమూవ్ కొట్టాలి.

మళ్ళీ రన్ ఓపెన్ చేసి ప్రీఫెచ్ అని టైప్ చేసి ఎంటర్ కొట్టాలి.

అన్ని ఫైల్స్ సెలెక్ట్ చేసుకుని రిమూవ్ కొట్టాలి.

పైన చెప్పుకున్న అన్ని పద్దతులు ఫాలో అయిన తరువాత ల్యాప్టాప్ లో కాష్ మెమరీ అంతా క్లియర్ అవుతుంది. దీనివల్ల ల్యాప్టాప్ కొత్తదానిలా పనిచేస్తుంది. అప్పుడప్పుడు ల్యాప్టాప్ లో ఈ కాష్ మెమరీ క్లియర్ చేస్తూ ఉంటే ల్యాప్టాప్ స్లోగా పనిచేయడం అనే సమస్య ఎదురుకాదు.

ఈ లక్షణాలున్న అబ్బాయిలంటే అమ్మాయిలకు చాలా ఇష్టమట..!

మహిళలలో ఐరన్ లోపం ఉంటే కనిపించే లక్షణాలు ఇవే..!

మరిన్ని ప్రత్యేక వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jun 18 , 2024 | 05:38 PM