Life Lesson: మీ జీతం ఎంత అని ఎవరైనా అడిగితే ఏం చెప్పాలి? రిటైర్డ్ ఐఏఎస్ ఇచ్చిన సలహా ఇది..!
ABN , Publish Date - Jun 30 , 2024 | 01:33 PM
ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరికి సాధారణంగా ఎదురయ్యే ప్రశ్న.. మీ జీతం ఎంత? అని. బంధువులు, స్నేహితులు, తెలిసినవారు.. ఇలా ప్రతి ఒక్కరూ మొదట ఏం ఉద్యోగం చేస్తున్నావని అడుగుతారు, ఆ తరువాత జీతం ఎంత అని మరొక ప్రశ్న కూడా అడుగుతారు.
ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరికి సాధారణంగా ఎదురయ్యే ప్రశ్న.. "మీ జీతం ఎంత?" అని. బంధువులు, స్నేహితులు, తెలిసినవారు.. ఇలా ప్రతి ఒక్కరూ మొదట ఏం ఉద్యోగం చేస్తున్నావని అడుగుతారు, ఆ తరువాత జీతం ఎంత అని మరొక ప్రశ్న కూడా అడుగుతారు. ప్రశ్న అడిగేవారు సాధారణంగానే అడుగుతారు కానీ సమాధానం చెప్పాల్సిన వారు చాలా డైలమాలో పడిపోతారు. ఉద్యోగం చేసే చాలా మంది ఎదుర్కోనే ఇబ్బందికర సమస్య ఇది. అయితే రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వికాస్ దివ్యకీర్తి మాత్రం ఈ ప్రశ్నకు సమాధానం ఏం చెప్పాలో వివరించారు. దీని గురించి తెలుసుకుంటే..
Black Chickpeas: నల్ల శనగలు ఇలా తిని చూడండి.. ఎంత ఈజీగా బరువు తగ్గుతారంటే..!
వికాస్ దివ్యకీర్తి(Vikas Divya Kirti) మాజీ ఐఏఎస్(Retired IAS officer) అధికారి. ఆయన ప్రస్తుతం ఐఏఎస్ కు సన్నద్ధం అవుతున్న విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధిస్తున్నారు. ఈయన 12th ఫెయిల్ సినిమాలో(12th Fail Movie) కూడా కనిపించారు. మీ జీతం ఎంత అనే ప్రశ్న ఎదురైనప్పుడు ఎలాంటి సమాధానం ఇవ్వాలో ఆయన చెప్పుకొచ్చారు.
బంధువులు ఎవరైనా "మీ జీతం ఎంత?" అని అడిగితే వారికి ఖచ్చితమైన సమాధానం చెప్పాలి. ఒకవేళ మీ జీతం తక్కువ ఉంటే దాని గురించి వివరించి చెప్పక్కర్లేదు. జీతం తక్కువగా ఉన్నప్పుడు సింపుల్ గా ప్యాకేజీ రూపంలో చెప్పాలి. ఏడాదికి ఎంత వస్తుందనే విషయం చెప్పాలి. బోనస్ లు, ఇతర ప్రోత్సాహకాలు గట్రా విడిగా ఇస్తున్నారని చెప్పాలి. ఇలా చెబితే బంధువుల ముందు గౌరవాన్ని నిలబెట్టుకోవచ్చు.
Health Tips: ఈ 3 తినండి చాలు.. 60 ఏళ్లు వచ్చినా యవ్వనంగా ఉంటారు..!
ఎవరైనా ఇతరులు జీతం గురించి అడిగినప్పుడు.. మీ జీతం తక్కువగా ఉన్నట్టేతే.. అలా అడగడం ఒత్తిడిగా అనిపిస్తే.. సింపుల్ గా జీతం ఎక్కువ చెప్పాలి. "జీతం ఎక్కువ చెప్పడం వల్ల ఎవరూ మీ జీతాన్ని తనిఖీ చేయరు కదా.. అలాంటప్పుడు ఎక్కువ చెబితే తప్పులేదు. కొందరు కావాలనే ఇతరులతో మిమ్మల్ని పోల్చడానికి జీతం గురించి అడుగుతుంటారు. అలాంటి వారికి ఇలా జీతం ఎక్కువ చెప్పడం సరైన సమాధానం". అని వికాస్ దివ్యకీర్తి చెప్పుకొచ్చారు.
Black Chickpeas: నల్ల శనగలు ఇలా తిని చూడండి.. ఎంత ఈజీగా బరువు తగ్గుతారంటే..!
మరిన్ని ప్రత్యేక వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.