Viral: ఎద్దును స్తంభానికి కట్టేసి కర్రతో చావబాదిన వ్యక్తి.. దారుణమైన వీడియో
ABN , Publish Date - Dec 30 , 2024 | 07:19 AM
ఓ వ్యక్తి ఎద్దును స్తంభానికి కట్టేసి కర్రతో చావబాదిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. యూపీలోని రాయ్‌బరేలీలో ఈ ఘటన వెలుగు చూసింది.
ఇంటర్నెట్ డెస్క్: మానవత్వమున్న వాడే మనిషి. కానీ కొందరు జంతువుల కంటే హీనంగా ప్రవర్తిస్తుంటారు. మూగజీవాలపై తమ ప్రతాపం ప్రదర్శిస్తుంటారు. కుక్కల పిల్లలు, లేగ దూడలు ఇలా తమని తాము ఏమాత్రం రక్షించుకోలేని వాటిని చిత్ర హింసలకు గురి చేస్తుంటారు. జంతురక్షణ కోసం ఎన్ని చట్టాలు వచ్చినా జనాల్లో మాత్రం ఆశించిన పూర్తి స్థాయి మార్పు రావట్లేదు. ఎక్కడో చోట జంతు హింసకు సంబంధించిన ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా మరింత భయానక వీడియో వెలుగులోకి వచ్చింది. ఇందులోని వ్యక్తి పాల్పడుతున్న హింస చూసి జనాలు హాహాకారాలు చేస్తున్నారు (Viral).
ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగినట్టు తెలుస్తోంది. వీడియోలో కనిపించిన దాని ప్రకారం, ఓ వ్యక్తి ఎద్దును స్తంభానికి కట్టేసి చావచితక కొట్టాడు. పొడవాంటి కర్ర తీసుకుని దాని ముఖంపై ఇష్టారీతిన కొట్టాడు. దెబ్బలకు తాళలేక, అక్కడి నుంచి పారిపోలేక అది నరకయాత అనుభవించింది.
Viral: ఖతర్ యువరాణి తన ప్రేమలో పడిందనుకుని భార్యకు విడాకులు! చివరకు జైలుపాలు!
అతడి నుంచి తప్పించుకునేందుకు విశ్వప్రయత్నం చేస్తూ అటూ ఇటూ తిరిగింది. దాని నొప్పిని చూస్తున్నా కూడా అతడి మనసు కరగలేదు సరికదా మరింత గట్టిగా దెబ్బలు వేశాడు. సున్నితమైన ప్రాంతమని తెలిసి కూడా దాన్ని చావచిత కొట్టాడు. ఈ దారుణాన్ని చూస్తు చూట్టూ నిలబడ్డ వారు ఒక్కరు కూడా అతడిని ఆపే ప్రయత్నం చేయలేదు. ఏదో చోద్యం చూస్తున్నట్టు ఆ దారుణాల్ని తిలకించారు. అయితే, ఎద్దుపై అతడు అంతలా ఎందుకు దాడి చేశాడనేది మాత్రం తెలియరాలేదు.
ఇక వీడియో నెట్టింట వైరల్ కావడంతో జనాలు మండిపడ్డారు. ఎద్దు బాధ చూస్తుంటే గుండె తరుక్కుపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘నోరు లేని జీవాన్ని ఇంతలా కొట్టేందుకు మనసు ఎలా వచ్చిందో’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ‘నీళ్లు జల్లితే భయపడి పారిపోయే జీవిని ఇంతలా హింసించాలా’ అని ప్రశ్నించారు. సమాజం ఏమైపోతోందోనని, ‘మనుషులు నానాటికీ క్రూరంగా అవుతున్నారని మరికొందరు చెప్పుకొచ్చారు. ఎద్దును కొడుతున్న వ్యక్తిని కూడా ఇలాగే దాడి చేయాలని మరికొందరు అన్నారు.
Viral: లీటరు నూనె ఫ్రీ ఇస్తామని చెప్పి మోసం.. బ్లింకిట్‌పై కస్టమర్ ఆరోపణ
కొందరు మాత్రం ఆ వ్యక్తిని సమర్థించే ప్రయత్నం చేశారు. ‘‘నగరాల్లో కూర్చుని జంతువుల సంరక్షణ గురించి మాట్లాడేవారికి గ్రామాల్లో రైతుల బాధ అర్థం కాదు. రోజంతా కష్టపడి పండించిన పంటలు ఎద్దులు, ఇతర జీవాలు పాడు చేయకుండా కాపాడుకునేందుకు నానా కష్టాలు పడాల్సి వస్తోంది’’ అని అన్నారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం తెగ ట్రెండవుతోంది. మరోవైపు, ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Viral: స్పోర్ట్స్ షూ వేసుకుని ఆఫీసుకు వచ్చినందుకు ఊస్టింగ్.. బాధితురాలికి రూ.32 లక్షల పరిహారం!