Share News

Viral Video: భూమ్మీద నూకలు ఉండడం అంటే ఇదేనేమో! భారీ ప్రమాదం నుంచి ఎలా తప్పించుకున్నాడో చూడండి..!

ABN , Publish Date - Jul 14 , 2024 | 03:28 PM

అదృష్టం బాగుంటే భారీ ప్రమాదాల నుంచి ఎలాగోలా తప్పించుకోచ్చు. ఇంకా బతికి ఉండాలని రాసుంటే చివరి నిమిషంలో ఏదో అద్భుతం జరిగి ప్రమాదం నుంచి బయటపడవచ్చు. తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డాడనే మాట మనం తరచుగా వినే ఉంటాం.

Viral Video: భూమ్మీద నూకలు ఉండడం అంటే ఇదేనేమో! భారీ ప్రమాదం నుంచి ఎలా తప్పించుకున్నాడో చూడండి..!

అదృష్టం బాగుంటే భారీ ప్రమాదాల నుంచి ఎలాగోలా తప్పించుకోచ్చు. ఇంకా బతికి ఉండాలని రాసుంటే చివరి నిమిషంలో ఏదో అద్భుతం జరిగి ప్రమాదం నుంచి బయటపడవచ్చు. తృటిలో ప్రమాదం (Accident) నుంచి బయటపడ్డాడనే మాట మనం తరచుగా వినే ఉంటాం. అలాంటి సందర్భాలకు సరిపడే వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న ఆ వీడియో చూస్తే ఆశ్చర్యంతో నోట మాట రాదు. సెకెను వ్యవధిలో ఓ వ్యక్తి తన ప్రాణాలను కాపాడుకున్నాడు (Viral Video).


brutal.accident.videos అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో రైలు (Train) వస్తుందనే సంకేతంతో రైల్వే గేట్‌ను వేశారు. అయినా ఓ బైకర్ (Biker) గేట్ కింద నుంచి దూరి రైలు పట్టాలు దాటేందుకు ప్రయత్నించాడు. వేగంగా వస్తున్న రైలు నుంచి తప్పించుకోవచ్చు అనుకున్నాడు. అయితే చివరకు రైలును దాటడం కష్టం అని తీర్మానించుకుని మనసు మార్చుకున్నాడు. పట్టాల వద్ద బైక్‌ను వదిలేసి వెనక్కి దూకేశాడు. వేగంగా వచ్చిన రైలు ధాటికి ఆ బైకు తునాతునకలు అయిపోయింది. ఆ వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు.


ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోకు కోట్లలో వ్యూస్ వచ్చాయి. 13 కోట్ల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``సెకెను విలువ ఏంటో ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది``, ``అతడు మరణాన్ని టచ్ చేసి తిరిగి వచ్చాడు``, ``ఇది అత్యంత నిర్లక్ష్యం``, ``ఈ వీడియో చూసిన వారెవరూ అలాంటి పొరపాట్లు చేయరు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Anant Ambani Wedding: అంబానీ అంటే ఆ మాత్రం ఉండాలి.. స్నేహితులకు రూ. 2 కోట్ల ఖరీదైన వాచ్‌లు.. షారూక్, రణ్వీర్‌లకు కూడా..


Viral: వధువు మెడలో తాళి కడుతుండగా వచ్చిందో మెసేజ్.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jul 14 , 2024 | 03:28 PM