Sri Rama Navami: నేడే సీతారామ కల్యాణం
ABN , Publish Date - Apr 06 , 2025 | 04:12 AM
భద్రాచల పుణ్య క్షేత్రంలో శ్రీరామ నవమి సందర్భంగా ఆదివారం సీతారాముల కల్యాణ మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మిథిలా స్టేడియంలోని శిల్పకళాశోభితమైన కల్యాణమండపంలో ఉదయం 10.30 గంటలకు తిరుకల్యాణ మహోత్సవం ప్రారంభమవుతుంది.

భద్రాచల పుణ్య క్షేత్రంలో శ్రీరామ నవమి సందర్భంగా ఆదివారం సీతారాముల కల్యాణ మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మిథిలా స్టేడియంలోని శిల్పకళాశోభితమైన కల్యాణమండపంలో ఉదయం 10.30 గంటలకు తిరుకల్యాణ మహోత్సవం ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం అభిజిత్ లగ్నంలో కల్యాణం జరుగుతుంది. ఉత్సవాలకు జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 1,800 మందికి పైగా పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు చేసింది. దేవస్థానం భక్తుల కోసం 2 లక్షల లడ్డూలను, 200 క్వింటాళ్ల తలంబ్రాలను పంపిణీకి సిద్ధం చేసింది. ఆర్టీసీ ఖమ్మం రీజియన్ పరిధిలో భద్రాచలానికి 197 ప్రత్యేక బస్సులను నడుపుతోంది. సోమవారం నిర్వహించే పట్టాభిషేక మహోత్సవానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ విచ్చేయనున్నారు.
భద్రాద్రి రామయ్యకు టీటీడీ పట్టువస్ర్తాలు
శ్రీరామ నవమి సందర్భంగా ఆదివారం భద్రాచలంలో శ్రీసీతారామచంద్రస్వామి వారికి టీటీడీ తరపున పట్టువస్ర్తాలు సమర్పించనున్నారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, అధికారులు ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు పట్టువస్ర్తాలు సమర్పిస్తారు.
ఇవి కూడా చదవండి..
సింహానికి చుక్కలు చూపించిన తేనెటీగలు..
సిట్ కస్టడీకి ‘కల్తీ నెయ్యి’ నిందితులు
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read More Latest Telugu News Click Here