Viral: జొమాటో, స్విగ్గీల్లో త్వరగా డెలివరీలు రావాలంటే ఇలా చేయండి: నెటిజన్
ABN , Publish Date - Sep 26 , 2024 | 09:54 PM
జొమాటో, స్విగ్గీలో ఆహారం త్వరగా డెలివరీ అయ్యేందుకు క్యాష్ ఆన్ డెలివరీ ఎంచుకోవాలని ఓ నెటిజన్ చేసిన సూచన పెద్ద చర్చనీయాంశంగా మారింది. జనాలు షాకైపోయేలా చేస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: జొమాటో, స్విగ్గీల్లో పెట్టిన ఆర్డర్ల డెలివరీల్లో ఒక్కోసారి జాప్యం జరుగుతుంటుంది. ఇది సాధారణమే. అయితే, కొందరికి మాత్రం ఇది మహా చిరాకు తెప్పిస్తుంది. దీంతో, ఆయా సంస్థలపై కస్టమర్లు ఒక్కోసారి కారాలుమిరియాలు నూరతారు. అయితే, తన సూచన పాటిస్తే ఆర్డర్‌లు త్వరగా డెలివరీ అవుతాయంటూ ఓ నెటిజన్ పెట్టిన పోస్టు నెట్టింట వైరల్ (Viral) అవుతోంది.
Viral: వామ్మో! పెళ్లికొచ్చిన అతిథుల నుంచి వధూవరులు రూ.2 లక్షలు చొప్పున వసూల్!
సదరు నెటిజన్ రెడిట్ ఈ పోస్టు పెట్టారు. ఆర్డర్ పెట్టేటప్పుడు క్యాష్ ఆన్ డెలివరీ ఎంచుకుంటే ఎటువంటి ఆలస్యం లేకుండా ఫుడ్ ఇంటికి చేరుతుందని చెప్పాడు. అంతేకాకుండా, సమస్య ఎదురైనప్పుడు కస్టమర్ కేర్‌తో సులభంగా మాట్లాడొచ్చని, నేరుగా ఎగ్జిక్యూటివ్‌తో మాట్లాడే అవకాశం కూడా ఉంటుందని వివరించాడు (Reddit User Shares Simple Hack For Faster Swiggy, Zomato Deliveries).
క్యాష్ ఆన్ డెలివరీ ఎంచుకున్నాక కూడా యూజర్ ఎక్స్‌పీరియన్స్‌లో మార్పు ఉండదని అన్నాడు. ఇంటికొచ్చిన డెలివరీ ఏజెంట్‌కు యూపీఐ లేవా వాలెట్‌తో కూడా డబ్బులు చెల్లించొచ్చని అన్నాడు.
Viral: షాకింగ్..నవజాత శిశువుతో పాలసీసా శుభ్రం చేయించిన వైనం!
రెండు రోజుల క్రితం చేసిన ఈ సూచనపై నెట్టింట పెద్ద చర్చ జరుగుతోంది. కొందరు సదరు నెటిజన్ సూచనతో ఏకీభవించారు. క్యాష్ ఆన్ డెలివరీ ఎంచుకున్నాక ఆహారం త్వరగా ఇంటికి డెలివరీ అయ్యిందన్నారు. కొందరు మాత్రం స్విగ్గీకి మద్దతు పలికారు. ఇబ్బందులు ఎదురైన ప్రతిసారీ తమకు ఎంతో కొంత రిఫండ్ ఇచ్చేవారని అన్నారు. తనకు కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ కావాల్సినప్పుడల్లా అందుబాటులోకి వచ్చేవాడని ఓ వ్యక్తి చెప్పుకొచ్చాడు. రిఫండ్ కూడా ఇబ్బంది లేకుండా వచ్చేదని వివరించాడు. వారి వ్యవస్థను దుర్వినియోగ పరచకపోవడం వల్లే ఇలా జరిగుండొచ్చని చెప్పారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం వైరల్ అవుతోంది.
Viral: 18 ఏళ్లుగా పక్కింటి వ్యక్తి కరెంటు బిల్లు చెల్లిస్తున్నట్టు తెలిసి షాక్!
Civil Aviation: విమానాలు గరిష్ఠంగా ఎంత ఎత్తులో ప్రయాణించగలవో తెలుసా?