Viral Video: ఉక్కు శరీరం అంటే ఇదేనేమో.. అతడి దెబ్బకు స్టీల్ రాడ్ ఎలా వంగిపోయిందో చూడండి..
ABN , Publish Date - Dec 02 , 2024 | 10:06 AM
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత మారుమూల గ్రామంలోని వ్యక్తి ప్రతిభ కూడా క్షణాల్లో అందరికీ చేరిపోతోంది. దీంతో చాలా మంది తమ ట్యాలెంట్‌ను ప్రదర్శిస్తూ సోషల్ మీడియా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. తాజాగా ఓ వ్యక్తి తన బలాన్ని నిరూపించే ఫీట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత సామాన్యులకు కూడా మంచి వేదిక దొరికింది. తమలోని ప్రతిభను (Talent) అందరికీ చేరే వేసే మాధ్యమం అందుబాటులోకి వచ్చింది. మారుమూల గ్రామంలోని వ్యక్తి ప్రతిభ కూడా క్షణాల్లో అందరికీ చేరిపోతోంది. దీంతో చాలా మంది తమ ట్యాలెంట్‌ను ప్రదర్శిస్తూ సోషల్ మీడియా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. తాజాగా ఓ వ్యక్తి తన బలాన్ని నిరూపించే ఫీట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అతడి దెబ్బకు స్టీల్ రాడ్ (Steel Rod) కూడా విరిగిపోయింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (Viral Video).
ilyaskhiladi626 అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఇలియాస్ అనే కుర్రాడు అద్భుతమైన ఫీట్ చేశాడు. ఓ స్టీల్ రాడ్‌ను మూడు లెగ్ కిక్‌లతో వంచేందుకు సిద్ధమయ్యాడు. ఆ ఫీట్‌కు ముందు ఆ రాడ్ నిజంగా స్టీల్‌దేనా, గట్టిగా ఉందా? లేదా? అని అక్కడ ఉన్న వ్యక్తులు తనిఖీ చేశారు. అది గట్టిదేనని నిశ్చయించుకున్నాక.. ఓ వ్యక్తి ఆ రాడ్‌ను పట్టుకుని నిల్చున్నాడు. అప్పుడు ఇస్మాయిల్ తన కాలితో ఆ రాడ్‌ను మెరుపు వేగంతో మూడు సార్లు తన్నాడు. దెబ్బకు ఆ రాడ్ సగానికి వంగిపోయింది. చుట్టు పక్కల వారు ఇస్మాయిల్‌ను అభినందించారు.
ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు 65 లక్షల కంటే ఎక్కువ మంది వీక్షించారు. 4.2 లక్షల మందికి పైగా ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``ఇది ఉక్కు శరీరం``, ``అతడి ఎముకలు ఇనుముతో నిర్మితమైనట్టు ఉన్నాయి``, ``కాలితో అలా తన్నడం నిజంగా చాలా గ్రేట్``, ``వావ్.. అతడికి చాలా స్టామినా ఉంది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: యూపీ నుంచి బీహార్‌కు.. లారీ బానెట్ తెరిచి చూసిన కార్మికులకు దిమ్మదిరిగే షాక్..
Viral Video: ఈమెను పెళ్లి చేసుకుంటే అప్పులన్నీ మాయం.. పెళ్లిలో వధువుకు వచ్చిన నగదు బహుమతులు చూస్తే..
Viral Video: ట్రైన్ తలుపు నుంచి వింత శబ్దాలు.. వాటిని ఆపేందుకు ఓ వ్యక్తి ఏం చేశాడో చూస్తే..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి