Viral: పెళ్లిళ్లు చెడగొట్టే యువకుడికి ఫుల్ డిమాండ్! కళ్లు చెదిరే సంపాదన!
ABN , Publish Date - Sep 20 , 2024 | 05:25 PM
పెళ్లిళ్లు చెడగొట్టడమే వృత్తిగా ఎంచుకున్న ఓ ప్రొఫెషనల్ రెండు చేతులా సంపాదిస్తున్నాడు. ఒక్కో పెళ్లి చెడగొట్టేందుకు రూ.47 వేలు వసూలు చేస్తున్నాడు. స్పెయిన్‌లో ఉండే అతడు ప్రస్తుతం నెట్టింట సంచలనంగా మారాడు.
ఇంటర్నెట్ డెస్క్: నేటి యువత తమ పెళ్లి వేడుక జీవితాంతం గుర్తుండిపోయేలా ఉండాలని కోరుకుంటోంది. దీంతో, వెడ్డింగ్ ప్లానర్స్, డెస్టినేషన్ వెడ్డింగ్స్ వంటి కొత్త ట్రెండ్స్ పుట్టుకొచ్చాయి. అయితే, కొందరు యువత మాత్రం చివరి నిమిషంలో మనసు మార్చుకుంటున్నారు. పెళ్లి పీటల వరకూ వచ్చిన వ్యవహారాన్ని తెంచుకోవాలనుకుంటున్నారు. కానీ ఈ దిశగా ఎలా ముందుకెళ్లాలో తెలీక అవస్థలు పడుతుంటారు. అలాంటి వారికి అండగా నిలుస్తూ పెళ్లిళ్లు కూలుస్తున్నాడో యువకుడు. తమ పెళ్లి చెడగొట్టండని ఎవరైనా చెబితే చాలు పెళ్లి వేదికకు చేరుకుని నానా యాగీ చేసి పెళ్లి చేడగొట్టేస్తున్నాడు. ఒక్క పెళ్లి చెడగొట్టినందుకు ఏకంగా రూ.47 వేలు పుచ్చుకుంటూ రెండు చేతులా ఆర్జిస్తున్న ఈ వ్యక్తి పేరు వారియా (Viral). అతడు ఉండేది స్పెయిన్‌లో!
Viral: చెత్త ఏరుకునే యువకుడి సంపాదన నెలకు రూ.1.5 లక్షలు.. షాక్‌లో జనాలు!
పెళ్లిళ్లు చెడగొట్టమే పనిగా పెట్టుకున్న వారియా తనని తాను ఓ ప్రొఫెషనల్‌గా అభివర్ణించుకుంటాడు. అంతేకాదు, దీన్నో లాభసాటి వ్యాపారంగా కూడా మార్చేశాడు. తమ పెళ్లి చెడగొట్టాలంటూ యువతులతో పాటు యువకులు కూడా సంప్రదిస్తుంటారని అతడు చెప్పాడు. పెళ్లిళ్లు చెడగొట్టేందుకు తాను ఇప్పటికే బోలెడన్ని ఒప్పందాలు చేసుకున్నానని, డిసెంబర్ వరకూ మరొకరికి సాయపడే తీరికే లేదని మీడియా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు (This Professional Wedding Destroyer Will Ruin Your Big Day For A Fee Of Rs 47000).
TamilNadu: మహిళా కస్టమర్ తిట్లు.. డెలివరీ ఏజెంట్ ఆత్మహత్య!
పెళ్లి చెడగొట్టేందుకు అతడు ఉపయోగించే టెక్నిక్ చాలా సింపుల్. మరికొద్ది క్షణాల్లో వధూవరులు భార్యాభర్తలు అవుతారనంగా మనోడు పెళ్లి వేదికపైకి ఎంట్రీ ఇస్తాడు. తనకు వధువు లేదా వరుడితో ప్రేమ వ్యవహారం ఉందని చెప్పి నానా లొల్లి చేస్తాడు. ఆ తరువాత వారిని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయే ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలో చుట్టుపక్కల వారు అతడికి నాలుగు తగిలించేందుకు ప్రయత్నించినా తన ప్రయత్నం మాత్రం ఆపడు.
Anand Mahindra: మానవాళికి ఎలాన్ మస్క్ ఇచ్చే అతిపెద్ద గిఫ్ట్! ఆనంద్ మహీంద్రా ప్రశంస!
అయితే, తనపై పడే ప్రతి దెబ్బకు 50 యూరోల చొప్పున లెక్క కట్టి మరీ వసూలు చేస్తాడు. ఇలా పక్కాగా పెళ్లిళ్లు చెడగొడుతున్న అతడి సేవలకు విపరీంతంగా డిమాండ్ నెలకొంది. మొదట్లో పెళ్లికి అంగీకరించినా చివరి నిమిషంలో మనసు మార్చుకునే అనేక మంది వధూవరులు అతడిని సంప్రదిస్తున్నారట.
Russia: ఆఫీసుల్లో శృంగారంలో పాల్గొనండి.. రష్యా అధ్యక్షుడి కొత్త సూచన!
పెళ్లిళ్లు చెడగొడుతున్నప్పటికీ తాను పక్కా ప్రొఫెషనల్‌గా వ్యవహరిస్తానని అతడు చెప్పాడు. తానెప్పుడు హద్దు మీరి ప్రవర్తించనని అన్నాడు. వధూవరుల అభీష్టం మేరకే నడుచుకుంటానని అన్నాడు. పేపర్‌లో ఓ ఫన్నీ ప్రకటన తనకు కొత్త ఆదాయమార్గాన్ని ఇచ్చిందని అన్నాడు. పెళ్లిళ్లు చెడగొడతానంటూ ఓ రోజు తాను పేపర్‌లో ఫన్నీ ప్రకటన ఇచ్చానని, ఆ రోజు బోలెడంత మంది తనను సంప్రదించారని అన్నారు. దీంతో, తనకీ బిజినెస్ ప్రారంభించాలన్న ఆలోచన వచ్చిందన్నారు.