Viral: ఇదేమీ నూతన సంవత్సర వేడుకలు దేవుడా! రోడ్డుపై పెట్రోల్ పోసి..
ABN , Publish Date - Dec 30 , 2024 | 03:35 PM
కొత్త సంవత్సరం థీమ్‌తో రీల్స్ చేయాలనే తాపత్రయంలో ఓ వ్యక్తి రోడ్డుపై పెట్రోల్‌ను 2024 అంకెల రూపంలో పోసి నిప్పంటించారు. వీడియో వైరల్ కావడంతో సదరు వ్యక్తిపై పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: మరో రెండు రోజుల్లో కొత్త సంవత్సరంలోకి ప్రవేశించబోతున్నాం. దీంతో, దేశవ్యాప్తంగా పండగ వాతావరణం వచ్చేసింది. ఇప్పటికే అనేక మంది నూతన సంవత్సర వేడుకలకు సిద్ధమైపోయారు. రకరకాల ప్లాన్లు సిద్ధం చేసుకున్నారు. ఇక సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలనుకునేవారికి ఇదో మంచి సందర్భం. దీంతో, ఇన్‌ఫ్లుయెన్సర్లు రకరకాల వీడియోలతో హోరెత్తిస్తున్నారు. అయితే, ఓ వ్యక్తి నూతన సంవత్సరం రాబోతోందన్న సంబరంలో చేసిన పని నెట్టింట జనాలను షేక్ చేస్తోంది. అతడి తీరు చూసి జనాలు షాకైపోతున్నారు (Viral).
Viral: ఎద్దును స్తంభానికి కట్టేసి కర్రతో చావబాదిన వ్యక్తి.. దారుణమైన వీడియో
వీడియోలో కనిపించిన దాని ప్రకారం, ఓ వ్యక్తి 2024కు వినూత్న రీతిలో వీడ్కులు పలికేందుకు ప్రయత్నించాడు. రహదారిపై కారు నిలిపి తన వెంట ఉన్న పెట్రోల్‌ను నేలపై 2024 ఆకారంలో పోసాడు. ఆ తరువాత వాటిపై అగ్గిపుల్ల విసిరాడు. నిప్పు తాకగానే ఒక్కసారిగా రోడ్డుపై మంటలు ఎగసిపడ్డాయి. పాత జ్ఞాపాల్ని కాల్చేస్తున్నట్టు, సమాధి చేస్తున్నట్టు సినిమాటిక్ ఎఫెక్ట్ ఇచ్చేందుకు అతడు ప్రయత్నించాడు. తాను సఫలమయ్యానని కూడా అనుకున్నాడు. కానీ ఇక్కడే అతడి అత్యుత్సాహం బెడిసికొట్టింది.
Viral: లీటరు నూనె ఫ్రీ ఇస్తామని చెప్పి మోసం.. బ్లింకిట్‌పై కస్టమర్ ఆరోపణ
న్యూయిర్ థీమ్‌తో చేసిన ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసుల దృష్టి పడింది. ఓ యూజర్ ఈ వీడియను నెట్టింట పోస్టు చేస్తూ యూపీ పోలీసులను ట్యాగ్ చేశాడు. ఘటనపై దృష్టిపెట్టాలని కోరారు. అతడి చర్యలు ప్రమాదకరమని హెచ్చరించారు. ‘‘ఇతడి పేరు షేక్ బిలాల్.. యూపీలో జాతీయ రహదారి-2లో ఓ వైపు తన థార్ వాహనాన్ని నిలిపి నేలపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు’’ అని క్యాప్షన్ జతచేశారు. దీంతో, స్పందించిన పోలీసులు తమకు సమాచారం అందగానే కేసు నమోదు చేశామని, చట్టపరమైన చర్యలు తీసుకున్నామని అన్నారు.
కాగా, ఇటీవల యూపీకి చెందిన మరో వ్యక్తి కూడా ఇలాంటి దారుణ వీడియోకు ప్రయత్నించాడు. సోషల్ మీడియాలో వైరల్ కావాలనే ఉద్దేశంతో అతడు తన కారు టాపుపై మట్టి పోసి వేగంగా హైవేపై డ్రైవ్ చేశాడు. గాలి కారణంగా కారు టాపుపై ఉన్న మట్టి ఎగిరి రోడ్డంతా పడుతుంటే వీడియోలో రికార్డు చేశాడు. ఇది పోలీసులకు చేరడంతో అతడ జాడ కనుక్కున్న వారు అతడి నుంచి కారును సీజ్ చేసి గట్టి గుణపాఠం చెప్పారు.