Share News

Viralvideo: పెళ్లి దుస్తుల్లో పోలీసు కానిస్టేబుల్ పరీక్ష కేంద్రానికి వచ్చిన వరుడు! ఏం జరిగిందని అడిగితే..

ABN , Publish Date - Feb 19 , 2024 | 03:28 PM

ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ వరుడు పెళ్లి దుస్తుల్లోనే పోలీస్ కానిస్టేబుల పరీక్షకు హాజరయ్యాడు. ఈ ఉదంతం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

Viralvideo: పెళ్లి దుస్తుల్లో పోలీసు కానిస్టేబుల్ పరీక్ష కేంద్రానికి వచ్చిన వరుడు! ఏం జరిగిందని అడిగితే..

ఇంటర్నెట్ డెస్క్: పెళ్లి దుస్తుల్లో కానిస్టేబుల్ ఉద్యోగ పరీక్షకు(Police Constable Exam) వచ్చిన వరుడిని (Groom) చూసి అక్కడున్న వారందరూ ఆశ్చర్యపోయారు. ఆ తరువాత అతడి ఉద్దేశం తెలిసి ప్రశంసల వర్షం కురిపించారు. ఉత్తరప్రదేశ్‌‌లోని (Uttarpradesh) మహోబా జిల్లాలో ఈ ఘటన వెలుగు చూసింది.

Viral: ఓనర్ ఆంటీ నుంచి కుర్రాడికి ఊహించని మెసేజ్..నన్ను కన్నకొడుకులా చూస్తుంది.. ఇప్పుడేం చేయాలంటూ..

పూర్తి వివరాల్లోకి వెళితే, ఇటీవల అక్కడ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు ప్రశాంత్ యాదవ్ అనే యువకుడు పెళ్లి దుస్తుల్లోనే హాజరయ్యాడు. సంప్రదాయిక దుస్తుల్లో వస్తున్న అతడిని చూసి తొలుత ఆశ్చర్యపోయారు. అతడు పరీక్ష రాయడానికి వచ్చాడని తెలిసి నోరెళ్లబెట్టారు. అతడను తన హాల్‌టిక్కెట్ చూపించి తన ఉద్దేశం చెప్పడంతో అతడిపై ప్రశంసల వర్షం కురిసింది (Uttarpradesh Groom appears for police constable exam exam in his wedding attire) .

Viral: లోకంలో నిజమైన ప్రేమే లేదా? గర్ల్‌ఫ్రెండ్‌కు మైక్రోసాఫ్ట్‌లో జాబ్ వచ్చేలా చేస్తే..


పోలీస్ ఉద్యోగంలో చేరి దేశ సేవచేయాలనేదే తన లక్ష్యమని అతడు చెప్పాడు. పెళ్లి కంటే తనకు కెరీర్‌యే ముఖ్యమన్నాడు. కాబట్టి, పరీక్ష పూర్తయ్యాకే ఏడడుగులు వేసేందుకు నిర్ణయించుకున్నట్టు వివరించాడు. అతడి నిజాయతీ, నిబద్ధత అక్కడున్న వారికి నచ్చి ప్రశాంత్‌ను పొగడ్తల్లో ముంచెత్తారు. దీంతో, ప్రశాంత్ ఉదంతం స్థానికంగానే కాకుండా నెట్టింట కూడా వైరల్ అవుతోంది. అతడి ఫొటోలకు లైకులు, షేర్లు ఓ రేంజ్‌లో వచ్చిపడుతున్నాయి. గతంలో కొందరు మహిళలు తమ శిశువులతో సహా వచ్చి పరీక్ష రాసిన ఘటనలు వైరల్ అయిన విషయం తెలిసిందే.

మినరల్ వాటర్ తాగుతారా? ఈ తప్పు అస్సలు చేయొద్దు

మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Feb 19 , 2024 | 03:32 PM