Share News

తెలుగు టైటాన్స్‌కు మరో ఓటమి

ABN , Publish Date - Dec 13 , 2024 | 03:12 AM

ప్రొ కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్‌కు మరో ఓటమి ఎదురైంది. గురువారం దబాంగ్‌ ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో 27-33 తేడాతో ఓడింది. ఈ విజయంతో ఢిల్లీ 61 పాయింట్లతో పట్టికలో రెండో స్థానానికి చేరింది...

తెలుగు టైటాన్స్‌కు మరో ఓటమి

పుణె: ప్రొ కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్‌కు మరో ఓటమి ఎదురైంది. గురువారం దబాంగ్‌ ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో 27-33 తేడాతో ఓడింది. ఈ విజయంతో ఢిల్లీ 61 పాయింట్లతో పట్టికలో రెండో స్థానానికి చేరింది. ఈ పోరు హోరాహోరీగా సాగినప్పటికీ చివర్లో నవీన్‌ కుమార్‌ సూపర్‌ 10 సాధించడంతో ఢిల్లీ నాలుగు పాయింట్లతో ఆధిక్యంలోకి వెళ్లింది. మొత్తంగా నవీన్‌ 11 పాయింట్లు సాధించాడు. ఆ తర్వాత యూపీ యోధ-బెంగాల్‌ వారియర్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌ 31-31 స్కోరుతో టైగా ముగిసింది.

Updated Date - Dec 13 , 2024 | 03:12 AM