Share News

Bengaluru: పెళ్లి పేరుతో అత్యాచారం.. భారత హాకీ ప్లేయర్‌పై కేసు..

ABN , Publish Date - Feb 06 , 2024 | 04:07 PM

Case Filed on Indian Hockey Player: ఇండియన్ హాకీ ప్లేయర్‌ వరుణ్ కుమార్‌పై బెంగళూరులో రేప్ కేసు నమోదైంది. పెళ్లి చేసుకుంటానని చెప్పి ఓ మహిళపై పలుమార్లు అత్యాచారం చేశాడని కేసు నమోదు చేశారు పోలీసులు. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

Bengaluru: పెళ్లి పేరుతో అత్యాచారం.. భారత హాకీ ప్లేయర్‌పై కేసు..
Indian Hockey Player

Case Filed on Indian Hockey Player: ఇండియన్ హాకీ ప్లేయర్‌ వరుణ్ కుమార్‌పై బెంగళూరులో రేప్ కేసు నమోదైంది. పెళ్లి చేసుకుంటానని చెప్పి ఓ మహిళపై పలుమార్లు అత్యాచారం చేశాడని కేసు నమోదు చేశారు పోలీసులు. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. హాకీ ప్లేయర్ వరుణ్ కుమార్.. బెంగళూరుకు చెందిన యువతి(21)ని పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఐదేళ్లుగా ఆమెపై అత్యాచారం చేశాడు. ఇప్పుడు పెళ్లి చేసుకోమంటే మొహం చాటేశాడని బాధిత యువతి తెలిపింది.

బాధిత యువతి తనకు 17 ఏళ్ల వయసులో వరుణ్ కుమార్ పరిచయం అయ్యాడని చెప్పింది. 2019లో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ట్రైనింగ్ తీసుకుంటున్నప్పటి నుంచి ఇన్‌స్టాగ్రమ్ ద్వారా పరిచయం అయ్యాడని తెలిపింది. అప్పటి నుంచి ఇద్దరి మధ్య పరిచయం పెరిగి.. అదికాస్తా ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానని మాయ మాటలు చెప్పి.. ఐదేళ్లుగా ఆమెతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు వరుణ్ కుమార్. ఇప్పుడు పెళ్లి టాపిక్ తీసుకురాగా.. కుదరదని చెబుతున్నాడని బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదు మేరకు వరుణ్ కుమార్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ప్రస్తుతం వరుణ్ కుమార్ పరారీలో ఉన్నాడని, అతన్ని ట్రేస్ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు పోలీసులు.

కాగా, హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన వరుణ్ కుమార్.. హాకీ ట్రైనింగ్ కోసం పంజాబ్ షిఫ్ట్ అయ్యాడు. అక్కడ ట్రైనింగ్ తీసుకుని.. 2017లో భారత హాకీ టీమ్‌కు సెలక్ట్ అయ్యాడు. బర్మింగ్‌హమ్ వేదికగా జరిగిన కామన్‌వెల్త్ గేమ్స్‌లో సిల్వర్ మెడల్ సాధించిన టీమ్‌లో ఒకడిగా వరుణ్ కుమార్ ఉన్నాడు. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో రజతం సాధించిన టీమ్‌లో, 2022లో ఆసియా గేమ్స్‌లో బంగారు పథకం సాధించిన టీమ్‌లో వరుణ్ కుమార్ ఆడాడు.

Updated Date - Feb 06 , 2024 | 04:07 PM